అమరావతి :
రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం అయిన సాగునీటి సంఘాల ఎన్నికలు
ఎన్నికల విధానం :
* ఉదయం 8 గంటలకు ప్రాదేశిక సభ్యుల ఎన్నికకు సమావేశం ఏర్పాటు చేస్తారు.
* 9 గంటల నుంచి ఓటర్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆ తర్వాత వారికి నీటి వినియోగానికి సంబంధించి స్థానిక పరిస్థితులపై చర్చిస్తారు.
* ఏకాభిప్రాయం కుదరని చోట ఓటర్ల ఎంపికను చేతులెత్తి చూపడం లేదా పత్రాలు ద్వారా తెలుసుకునే ఏర్పాట్లు చేస్తారు.
* 9.45 నుంచి 10.15 గంటల వరకు పోటీదారుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.
* వాటి పరిశీలన తర్వాత అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.
* 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఎన్నిక జరుగుతుంది.
* మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన చేస్తారు.
* 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకునేందుకు ప్రత్యేక యాజమాన్య కమిటీ సమావేశం జరుగుతుంది.


Be the first to comment