రాయదుర్గంలో రైలు నుంచి దూకి యువతి ఆత్మహత్య
కదులుతున్న రైలు నుంచి దూకి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. రాయదుర్గం మండల శివారులోని పైతోట సమీపంలో రైలు నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన తనుజాగా గుర్తించారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి విచారణ ప్రారంభించారు. అయితే ఘటనకు కారణాలు అధికారుల విచారణలో తెలియాల్సి ఉంది.


Be the first to comment