*తిరుమలలో భక్తుల రద్దీ*
AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండి గోగర్భం జలాశయం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 52,643 మంది భక్తులు దర్శించుకోగా, 24,527 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు లభించింది. కాగా ఇవాళ తిరుమలలో వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ సందర్భంగా పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.


Be the first to comment