విజ్ఞానం పెరిగినంతగా జ్ఞానం పెరగలేదు
భార్య ప్రసవ వేదనలో అనుభవిస్తున్న బాధను ఆమె భర్త చూస్తే ఒక ఆడదాన్ని ఎలా గౌరవించాలో తెలుస్తుందనే ఆలోచనతో ప్రసవించే గదిలోకి భర్తను అనుమతించడం జరుగుతుంది.
కానీ ఓ యూ ట్యూబర్ తన భార్య ప్రసవించే గదిలో వీడియో తీసి తన యూట్యూబ్ లో పోస్ట్ చేసాడు.
యూట్యూబ్ ఛానల్ లేదా న్యూస్ ఛానల్ పెట్టుకుంటే ఏమైనా పోస్ట్ చేయొచ్చని, ఏదైనా రాసేయ్యొచ్చని ఎవరు చెప్పారు. నలుగురికి తెలియని విషయాలను వివరించాలి నలుగురికి ఉపయోగపడే వార్తలు రాయాలి కానీ ఇంత దారుణంగా ప్రతిదీ కంటెంట్ అనుకుని వ్యక్తిగత పోస్టులు చేస్తూ ఫ్యామిలీ వార్తలు రాస్తూ ఎదుటి వ్యక్తి స్వేచ్ఛను హరిస్తుంటే ఏమనాలి.
అందుకే అంటున్న…విజ్ఞానం పెరిగినంతగా జ్ఞానం పెరగలేదని


Be the first to comment