అహుడ చైర్మన్ శ్రీ టి.సి.వరుణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్కేయూ రాయల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు…
అనంతపురము – హిందూపురము అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ టీ.సీ.వరుణ్ గారిని సోమవారము స్థానిక రామ్ నగర్ కార్యాలయంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం రాయల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం, మెమెంటో అందజేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులుగా పార్టీని సమర్థవంతంగా నడిపించిన శ్రీ టి.సి.వరుణ్ గారికి అహుడా చైర్మన్ పదవి రావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శ్రీ గణేష్ రాయల్, అకాడమీ కన్సల్ట్ శ్రీ చంద్రబాబు, సూపర్డెంట్ శ్రీనివాసులు, శ్రీ సాయి శివ, అసిస్టెంట్ శ్రీ నరసింహులు, జూనియర్ అసిస్టెంట్ శ్రీ మధు, శ్రీ చంద్ర రాయుడు, శ్రీ వెంకటరమణ, శ్రీ ప్రవీణ్, శ్రీ క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Be the first to comment