తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ భవనం శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి
పాల్గొన్న అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ శాఖ చైర్మన్ పొదెం వీరయ్య
హాజరైన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో కోట్ల విజయ భాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్‌లో తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ భవనం శంకుస్థాపన చేశారు. దీంతో పాటు పలు ఎకో టూరిజం ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కొండా సురేఖ, చైర్మన్ పొదెం వీరయ్య లతో కలిసి ప్రారంభించారు. బొటానికల్ థీమ్ పార్కులు, వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ, ప్రకృతి అందాలు చెంతకు తెచ్చే అద్భుతమైన వృక్ష పరిచయ కేంద్రాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు.


Be the first to comment