కర్నూల్ నగర బలిజ సంఘం.
కుడా ఛైర్మన్ ను సత్కరించిన బలిజ సంఘం నాయకులు
ఇటీవల కుడా ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారిని వారి గృహంలో కలసిన కర్నూలు నగర బలిజ సంఘం నాయకులు అధ్యక్షులు లక్ష్మన్న, ప్రధాన కార్యదర్శి రవికుమార్ ల సారథ్యంలో పూల గుత్తులు, శాలువాలతో శ్రీ వెంకటేశ్వర్లు గారిని ఘనంగా సత్కరించారు. వారి పదవీ కాలంలో తీసుకునే నిర్ణయాలు, చేపట్టే కార్యక్రమాలు కర్నూలు నగర పురోభివృద్ధి కి తోడ్పడాలని వారి పదవీ కాలం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేసారు. కర్నూలు నగరంలో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రారంభమై, జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆగిపోయిన డాక్టర్స్ కాలనీ లోని బలిజ భవన్ నిర్మాణం పూర్తి అయ్యేలా చూడాలని అభ్యర్థించారు. సంఘం అభ్యర్థనపై శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు సానుకూలంగా స్పందిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు గారిని కలిసినపుడు తప్పక ఈ విషయం పై మాట్లాడుతానని, కాపు భవన్ నిర్మాణం పూర్తి చేసేందుకు సంపూర్ణ సహాయసహకారాలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు పత్తి ఓబులయ్య, సోమశేఖర్, కోశాధికారి శైలేష్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Be the first to comment