*ఏపీలో పీఎం కిసాన్ నిధిలో 62వేల మంది రైతులకు లబ్ది జరగటం లేదు*
*-పీఎం కిసాన్ పాలసీని గత ఐదేళ్లుగా కేంద్రం అప్ డేట్ చేయటం లేదు*
*-లోక్ సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణ దేవరాయలు*
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 41లక్షల 84 వేల మంది రైతులు అర్హులు ఉండగా,, ప్రస్తుతం 41లక్షల 22వేల మంది మాత్రమే లబ్ది పొందుతున్నారని టీడీపీ ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు లోక్ సభలో ప్రస్తావించారు. దాదాపు 62వేల మంది రైతులకు లబ్ది జరగటం లేదని, అందుకు ఈ పాలసీను గత ఐదేల్లుగా అప్ డేట్ చేయకపోవటమే ప్రధాన కారణం అని మాట్లాడారు. 2018 డిసెంబర్ -2019 ఏప్రిల్ వరకు భూములు ఎవరి పేరుపై ఉన్నాయో వారినే పీఎం కిసాన్ లో పరిగణలోకి తీసుకున్నారని, కానీ ఆ తర్వాత చాలా మంది రైతులు గిఫ్ట్ డీడ్, విక్రయాలు, వారి పిల్లలకి ఇచ్చారని ప్రస్తావించారు. కేవలం అప్ డేట్ జరగక పోవడం వల్లనే అర్హులైన రైతులకు లబ్ది జరగలేదని, మా రాష్ట్రం లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పథకం విషయంలోనే ఇదే పరిస్థితి అని లేవనేత్తారు. ఈ డేటాను ఎప్పుడు అప్ డేట్ చేస్తారు? మిగతా రైతులకు ఎప్పుడు లబ్ది చేకూరుస్తారు? అని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కేంద్రాన్ని ప్రశ్నించారు.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా దేశ వ్యాప్తంగా 1కోటి మంది రైతులకు లబ్ది చేకూరుస్తూ.. పిఎం కిసాన్ పాలసీని ప్రారంభించామని, తర్వాత మరో 25లక్షలు మందిని ఈ పథకంలో చేర్చాం, భవిష్యత్ లో అర్హులైన వారిని చేర్చే ప్రణాళికతో ఉన్నామని అన్నారు. ఈ పథకానికి సంబందించిన కొంత వివరాలు రాష్ట్రాల నుండి అందలేదని, అవి రాగానే అప్ డేట్ చేస్తామని వివరణ ఇచ్చారు.


Be the first to comment