అన్నంపేట సచివాలయం సందర్శించిన జనసేన నాయకులు

బూర్జ మండలం అన్నంపేట సచివాలయం సందర్శించి సచివాలయం సిబ్బంది తో ప్రభుత్వం త్వరలో జారీ చేయబోయే రేషన్ కార్డ్స్, కొత్త పెన్షన్స్, హోసింగ్ తదితర అంశాలు గురించి మాట్లాడి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలు ప్రజలుకి చేరావేయడం లో జాప్యం జరగకుండా చూడాలి అని కోరుతూ ఇది మంచి ప్రభుత్వం అందరికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటాది అని నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కూన రవి కుమార్ గారు ప్రజలు కోసం ప్రజలు తో మమేకమై ప్రజా సమస్యలుకి తక్షణమే పరిస్కారం ఇస్తున్నారు. దీని అనుగుణంగా సచివాలయం సిబ్బంది, కూటమి నాయకులు కూడా పనిచేస్తే సత్పలితాలు వస్తాయి అని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కొల్ల జయరాం అన్నారు. అందరికి సంక్షేమ పథకాలు అందచేయడం లో సచివాలయం సిబ్బంది ప్రధాన భూమికి పోషించాలి అని బూర్జ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొత్తకోట నాగేంద్ర గారు అన్నారు.

పంచాయతీ కార్యదర్శి కోరిక మేరకు LED లైట్స్ అన్నంపేట మరియు మాసాన పుట్టి గ్రామాలలో కొన్ని వీధి లైట్స్ అందచేస్తాము అని కొల్ల జయరాం అన్నారు.
ఈ కార్యక్రమం లో అన్నంపేట జనసేన నాయకులు కుప్పిలి చంటి, సోమరాజు పవన్, గుంటబోయన కృష్ణ, దంత రాజేష్, మజ్జి సింహాచలం.,టీడీపీ నాయకులు సైలాడ దుర్గారావు కరణం రామకృష్ణ
మసాన పుట్టి జనసేన నాయకులు బాలకృష్ణ పాల్గొన్నారు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*