కూటమికి మద్దతుగా ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో మహాయుతి కూటమి అభ్యర్థులు విజయం సాధించారు.

జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి మద్దతుగా ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో మహాయుతి కూటమి అభ్యర్థులు విజయం సాధించారు.

డేగ్లూర్, భోకర్, లాతూర్, షోలాపూర్ నగరంలోని మూడు స్థానాలు, బల్లార్ పూర్, చంద్రాపూర్, పుణె కంటోన్మెంట్, హడ్సర్ పూర్, కస్బాపేట్ నియోజకవర్గాలలోని మహాయుతి అభ్యర్థులను గెలిపించాలని శ్రీ పవన్ కల్యాణ్ గారు సభల్లో పాల్గొన్నారు. రోడ్ షోలు నిర్వహించారు. శ్రీ పవన్ కల్యాణ్ గారు ప్రచారం చేసిన నియోజకవర్గాలు అన్నిటా విజయం దక్కడంతో మరోసారి 100 శాతం రిజల్ట్ మార్క్ అందుకున్నారు.

లాతూర్ సిటీ, డేగ్లూర్ అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ తొలిసారి విజయం అందుకోవడం గమనార్హం.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*