సింహాచలం ఆలయ భూములు భారీగా గోల్మాల్..*
ఈనెల 22వ తేదీ విశాఖ రీజినల్ విజిలెన్స్ కార్యాలయంకు సదరు అధికారులు హాజరవ్వాలని దేవాదాయ శాఖ కమిషనర్ కు ఆదేశాలు
అప్పటి ఈవో రామచంద్ర మోహన్ దేవాదాయ శాఖ నుంచి భూములు తప్పించి అక్రమాలకు పాల్పడ్డారని అవినీతి ఆరోపణలు.
సింహాచలం ఆలయ భూములతో పాటు మానస్ ట్రస్ట్ కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన రామచంద్ర మోహన్ సమయంలో పెద్ద ఎత్తున అవినీతి కి పాల్పడ్డారని చట్ట వ్యతిరేకంగా దేవాదాయ శాఖ రిజిస్టర్ లోని భూములను తప్పించి అక్రమాలు చేశారని అభియోగాలు.
ఆలయ భూములకు సంబంధించిన రిజిస్టర్ లో ఆ భూములు వివరాలు లేకుండా తొలగించారని రామచంద్ర మోహన్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు
సదరు అవినీతి ఆరోపణలపై జులై 16 2021 లో విచారణ చేసిన దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల కమిటీ ముగ్గురు సభ్యుల కమిటీతో అవినీతి ఆరోపణలపై విచారణ చేసిన కమిటీ బృందం. టి చంద్రకుమార్, డి భ్రమరాంబ, ఈ .వి పుష్పవర్ధన్ .
వందల కోట్ల అవినీతి జరిగిందా..?
దేవాదాయ శాఖ సింహాచలం ఆలయ భూములతో పాటు మానస ట్రస్ట్ కు సంబంధించిన వందలాది ఎకరాల భూములు ఏ విధంగా దేవాదాయ శాఖ రిజిస్టర్ లోంచి తొలగించారని విషయాలపై విజిలెన్స్ పూర్తిస్థాయి విచారణ చేపట్టినట్టుగా సమాచారం.
దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు బృందం కమిటీగా ఏర్పడి సదరు అవినీతి ఆరోపణలపై 2021 లో విచారణకు సంబంధించిన అంశాలతో కూడిన వివరాలను నివేదించారు.
ఈనెల 22వ తేదీ విశాఖ విజిలెన్స్ రీజినల్ కార్యాలయం వద్ద ఈ నివేదిక సమర్పించిన ముగ్గురు అధికారులు చంద్రకుమార్ , బ్రమరాంబ పుష్ప వర్ధన్ హాజరవ్వాలని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం కు విజిలెన్స్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు
వందల కోట్ల అవినీతి వెలుగులోకి వస్తుందా లేక ఈ వివరాలు తూతూ మంత్రంగా పక్కన పడేస్తారా అనే విషయాలు ఇప్పుడు దేవాదాయ శాఖలో చర్చకు దారి తీసింది……


Be the first to comment