ఇల్లు, క్యాంపు కార్యాలయం నిర్మాణం కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన నియోజకవర్గం పిఠాపురంలో మరో 12 ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. ఎన్నికల ముందు పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటానని అక్కడి ప్రజలకు జనసేనాని మాటిచ్చారు. అందులో భాగంగానే జులైలో ఇల్లింద్రాడ, భోగాపురంలో వరుసగా 2.08, 1.44 ఎకరాలు కొనుగోలు చేశారు.
సోమవారం పిఠాపురంలో పర్యటించిన పవన్ గతంలో కొన్నచోటే మరోసారి 12 ఎకరాలు కొనుగోలు చేశారు. దీని రిజిస్ట్రేషన్‌ను ఆయన తరఫున రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్ తోట సుధీర్ మంగళవారం పూర్తి చేయడం జరిగింది. త్వరలోనే ఈ స్థలంలో ఇల్లు, క్యాంపు కార్యాలయం నిర్మించనున్నారని సమాచారం.


Be the first to comment