పోలవరం నియోజవర్గం జనసేన పార్టీ కార్యాలయం…
పోలవరం నిర్వాసితుల గురించి అసెంబ్లీలో గళం విప్పిన ఎమ్మెల్యే బాలరాజు గారికి ధన్యవాదములు తెలిపిన కుక్కునూరు మండల నాయకత్వం…
అసెంబ్లీ సమావేశంలో మంగళవారం నాడు పోలవరం నిర్వాసితుల తరపున గళం ఎత్తిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారికి జనసేన పార్టీ మండల అధ్యక్షులు ములిశెట్టి యుగంధర్ గారి ఆధ్వర్యంలో కుక్కునూరు మండల నాయకత్వం హర్షం వ్యక్తం చేశారు.
పోలవరం నిర్వాసితులకు పూర్తిగా న్యాయం జరగాలని, అది కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుందని తెలియజేశారు. అందుకు అనుగుణంగా కుక్కునూరు మండల కేంద్రంలో భారీ ఎత్తున నిర్వాసితులు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారి చిత్ర పటానికి పుష్పాలు చల్లి హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ములిశెట్టి యుగంధర్ మాట్లాడుతూ నిర్వాసితుల తరఫున అసెంబ్లీ సాక్షిగా మాకోసం అయన మాట్లాడటం ధైర్యాన్ని నింపిందని, త్వరలోనే నిర్వాసితో సమస్యలు పూర్తిగా ఎమ్మెల్యే బాలరాజు సారధ్యంలో కూటమి ప్రభుత్వం నిర్వసితులకు న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.అనంతరం కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి అని వాస్తు నిర్వసితులు చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు ములిశెట్టి యుగంధర్, ఉపాధ్యక్షులు మంత్రి గోపాల కృష్ణ, మోదుంపురపు వెంకన్న బాబు, గంధం నాగరాజు, కుక్కునూరు సీతారామయ్య, మేడిపల్లి వీరబాబు, పిచ్చుక హరిబాబు, గారటం రమణ, పరిటాల వరమ్మ, గణేష్, మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు


Be the first to comment