అమలాపురం లో “ఆప్తా” స్కాలర్షిప్పుల పంపిణీ !!
“ఆప్తా” స్కాలర్షిప్పుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పూర్వ కలెక్టర్ లక్ష్మీకాంతం, ఢిల్లీ మెండు చక్రపాణి.
అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్తా) ఆధ్వర్యంలో అమలాపురం లోని కాపు కళ్యాణ మండపంలో “ఆప్తా” స్కాలర్షిప్పుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
సంఘ అధ్యక్షులు అ ముద్రగడ త్రినాథ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు నాలుగు వందల మంది విద్యార్థినీ, విద్యార్థులకు 2.50 కోట్లకు పైగా స్కాలర్షిప్ అందజేశారు. ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్ వి.లక్ష్మీ కాంతం, “ఐకాన్” మెండు చక్రపాణి అమెరికా నుంచి వచ్చిన ఆప్తా ప్రతినిధులు గూఢపాటి గోపాల్,భోగాటి రెడ్డీస్,సప్తగిరీ, మంచిగంటి శ్రీ లక్ష్మీ దీప్తి తదితరులు పాల్గొన్నారు. తొలుత సమావేశానికి నల్లా పవన్ కుమార్ సాదరంగా స్వాగతం పలికారు.
.


Be the first to comment