జనసేన నాయకులు శ్రీ కాయగూరల లక్ష్మీపతిని పరామర్శించిన అహుడా చైర్మన్ శ్రీ టి.సి.వరుణ్

జనసేన నాయకులు శ్రీ కాయగూరల లక్ష్మీపతిని పరామర్శించిన అహుడా చైర్మన్ శ్రీ టి.సి.వరుణ్

జనసేన నాయకులు శ్రీ కాయగూరల లక్ష్మీపతిని పరామర్శించిన.

జనసేన జిల్లా అధ్యక్షులు, అహుడా చైర్మన్ శ్రీ టి.సి.వరుణ్ గారు.

అనంతపురము జనసేన సీనియర్ నాయకులు శ్రీ కాయగూరల లక్ష్మీపతి గారిని జనసేన జిల్లా అధ్యక్షులు, అహుడా చైర్మన్ శ్రీ టీ.సి.వరుణ్ గారు పరామర్శించారు. తిరుపతి బర్డ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం అనంతపురంలోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న అహుడా చైర్మన్ శ్రీ టీ.సీ.వరుణ్ గారు శనివారము ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. త్వరగా కోలుకొని జనసేన క్రియాశీలక కార్యక్రమాల్లో శ్రీ కాయగూరల లక్ష్మీపతి గారు పాల్గొనాలని శ్రీ టీ.సి.వరుణ్ గారు ఆకాంక్షించారు. అహుడా చైర్మన్ గా శ్రీ టి.సి.వరుణ్ గారు నియమితులైన సందర్భంగా శ్రీ కాయగూరల లక్ష్మీపతి గారు హర్షం వ్యక్తం చేస్తూ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు శ్రీ పొదిలి బాబురావు, తాడిపత్రి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ కదిరి శ్రీకాంత్ రెడ్డి, నగర ఉపాధ్యక్షులు గ్రంధి దివాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి శ్రీ సంజీవ రాయుడు, జిల్లా సహాయ కార్యదర్శి శ్రీ అవుకు విజయకుమార్, నగర కార్యదర్శి శ్రీ శ్రీ కుమార్ మురళి, నాయకులు శ్రీ వెన్నెల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*