భక్తి తో బ్రతుకును బాగు చేసుకుందాం

భక్తి తో బ్రతుకును బాగు చేసుకుందాం!

ఇవి అత్యంత పవిత్రమైన రోజులు కనుక పవిత్రంగా ఉండే ప్రయత్నం చేద్దాం.
భక్తి పెంచుకుందాం భక్తితో పాటు మొక్కను కూడా పెంచుకుందాం!.
ఇప్పుడు పాటించే నియమ నిష్టలు జీవితాంతం ఉండేలా చూసుకుందాం!
ఇప్పుడు చూపే ప్రేమ, ఆదరణ, నిజాయితీ, నిస్వార్థం బ్రతికినంతకాలం చూపిద్దాం!
పక్కవారికోసం కూడా పూజలు చేద్దాం!
దేవుణ్ణి అన్నీ కోర్కెలే కోరుకోకుండా మనిషిగా నా కర్తవ్యం ఏంటి అని అడుగుదాం!
నా పూజలన్నీ ఫలించాలి అంటే నేను ఎలా బ్రతకాలో నేర్పమని వేడుకుందాం!
పర్యావరణాన్ని కాపాడటానికి ఏమి చెయ్యాలో చెప్పమని దేవుణ్ణి అడుగుదాం!
భూమిని ఎలా కాపాడుకోవాలో నేర్పించమని వేడుకుందాం!
దేవుడు ఏ రూపంలో ఉన్నా మనం అడిగినవి అన్నీ ఇస్తాడు, కని సాటి మనిషి రూపంలోనే,
దేవుడు తనంతట తానే వచ్చి నిన్ను కరుణించడు, నీకు తెలిసిన మనుషుల ద్వారానే సహాయం చేస్తాడు.
దేవుడు ఎక్కడ ఉన్నాడో అని వెతకడం కంటే మన చుట్టూ ఉన్న మనుషుల్లో చూడగలిగితే నువ్వు నిత్యం స్వర్గంలో ఉన్నట్లే!, నిత్యం దేవునితో ఉన్నట్లే!

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*