నావికులను కాపాడేందుకు భరత్ పాక్ కలయిక

ఉత్తర అరేబియా సముద్రంలో మునిగిపోతున్న ఓ నావ నుంచి 12 మంది భారతీయ నావికులను కాపాడేందుకు భారత్‌-పాక్‌ చేతులు కలిపాయి. ఇందుకోసం భారత కోస్ట్‌గార్డ్స్‌(ఐసీజీ), పాకిస్థాన్‌ సముద్ర భద్రత దళం(పీఎంఎ్‌సఏ) అరేబియా సముద్రంలో సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ వివరాలను ఐసీజీ అధికారులు గురువారం ‘ఎక్స్‌’లో పంచుకున్నారు. బుధవారం గుజరాత్‌ తీరంలోని పోరుబందర్‌ నుంచి ఇరాన్‌కు బయలుదేరిన నావ.. ద్వారకకు పశ్చిమాన 270 కిలోమీటర్ల దూ రంలో.. పాకిస్థాన్‌ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ(ఎ్‌సఏఆర్‌) ప్రాదేశిక జలాల్లోకి వెళ్లగానే ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. దాంతో నావ మునిగిపోతుండడంతో.. ముంబైలోని మారిటైమ్‌ రెస్క్యూ కోఆర్డినేషన్‌ సెంటర్‌(ఎంఆర్‌సీసీ)కు ఎమర్జెన్సీ కాల్‌ అందింది. ఎంఆర్‌సీసీ నుంచి గాంధీనగర్‌లోని కోస్ట్‌గార్డ్స్‌ వాయవ్య విభాగం ప్రధాన కార్యాలయం, పాకిస్థాన్‌ ఎంఎ్‌సఏకు సందేశాలు వెళ్లాయి. కోస్ట్‌గార్డ్స్‌ అధికారులు ఐసీజీఎ్‌స-సార్థక్‌ను రంగంలోకి దింపారు. ఆలోగా పీఎంఎ్‌సఏ సిబ్బంది హెలికాప్టర్‌ ద్వారా గాలింపు చేపట్టి, మునుగుతున్న నావను గుర్తించారు. వాణిజ్య నౌక ఎంవీ-కాస్కోగ్లోరీ సిబ్బంది కూడా నౌకను గుర్తించడంలో సాయపడ్డారు. భారత కోస్ట్‌గార్డ్స్‌ సమయానికి అక్కడికి చేరుకుని, నౌకలోని 12 మందిని కాపాడారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*