మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కలిసిన జనసేన కనపర్తి మనోజ్ కుమార్
మైనర్ విద్యార్థి మైధిలి మరణం కేసులో లారీ డ్రైవర్ తో పాటు, జిల్లా స్పోర్ట్స్ సెక్రటరీ కోటు వనజ, పిఈటి బిన్నీ, కుంచాల కృపాకర్ లఫై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
మరణించిన మైనర్ విద్యార్థి మైధిలి తల్లిదండ్రులతో కలిసి న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారిని కలిసి మైధిలి మరణానికి రోడ్డు ప్రమాదం ఒక్కటే కారణం కాదని, మైధిలి వినుకొండలో టోర్నమెంట్ ముగించుకొని కావలి శివారులో రోడ్డు ప్రమాదంలో మరణించే వరకు చోటు చేసుకున్న ప్రతిఘటన కూడా కారణమే అని, మైనర్ విద్యార్థి మైధిలి మరణానికి కారణమైన జిల్లా స్పోర్ట్స్ సెక్రటరీ కోటు వనజ, పిఈటి బిన్నీ, మరియు మైనర్ విద్యార్థి మైధిలికి మాయమాటలు చెప్పి ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో దారి మళ్లించి వెంట తీసుకువెళ్లిన కుంచాల కృపాకర్ లను నిందితులుగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయించి, మైధిలి తల్లిదండ్రులకు న్యాయం చేయండి అని కనపర్తి మనోజ్ కుమార్ ఈరోజు మంత్రి గారిని కలసి ఫిర్యాదు చేశారు.


Be the first to comment