శ్రీవాణి ట్రస్టు రద్దు నూతన ఛైర్మన్ నాయుడు
శ్రీవాణి ట్రస్టు రద్దు చేయాలనేది తన ఆలోచన అని నూతన ఛైర్మన్ నాయుడు స్పష్టంచేశారు. ఒక పెద్ద ట్రస్టు ఉన్నప్పుడు మరో ట్రస్టు ఎందుకని ప్రశ్నించారు. దర్శనం కోసం భక్తులను ఎక్కువ సేపు కంపార్టుమెంట్లలో ఉంచటం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. టికెట్ల విషయంలో ఆలోచన చేస్తామని.. గతంలో ఉన్న పద్ధతిని మళ్లీ తీసుకొస్తామని వెల్లడించారు. మెటీరియల్ సప్లయ్, ఆలయ భూములపై ప్రత్యేక కమిటీలు వేస్తామని ప్రకటించారు. తిరుమలలోని యూనివర్సిటీ, ఆస్పత్రుల పై దృష్టిసారిస్తామని నాయుడు స్పష్టం చేశారు. కొండపై గాజు సీసాల్లో నీళ్లు భక్తులకు భారంగా మారాయని పేర్కొన్నారు. కొండ పైన వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి పేపర్ గ్లాసులు ఉచితంగా ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నామని నాయుడు చెప్పుకొచ్చారు.


Be the first to comment