కృష్ణాజిల్లా: గన్నవరం నియోజకవర్గం
నియోజకవర్గ కేంద్రమైన గన్నవరంలో నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ రాష్ట్ర ఎలక్షన్ మీడియా కోఆర్డినేటర్ గరికిపాటి శివశంకర్ సహకారంతో శంకర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటే వైద్య శిబిరం విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు జెడ్పి ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన విజయనగరం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు కలిసేట్టి అప్పలనాయుడు, ఉత్తరాంధ్ర తెలగ సంఘ అధ్యక్షులు పివిఆర్ , సెంట్రల్ ఆంధ్ర కన్వీనరే బాడిత శంకర్ పాల్గొని రిబ్బన్ కట్ చేసి ఉచిత క్యాంపు ను ప్రారంభించారు.
ఈ క్యాంపులో ఉచితంగా కంటి పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేయడం, అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయించడం జరిగితుంది.
ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ విజయవాడ రూరల్ మండలం రామవరపాడులో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకంగా ఉందని అన్నారు. అలానే నియోజవర్గంలోని అన్ని గ్రామాల్లో కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం వలన ఎంతోమందికి మేలు కలుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా శంకర్ ఐ ఇన్స్టిట్యూట్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
గన్నవరం జనసేన నాయకులు గరికిపాటి శివశంకర్ మాట్లాడుతూ
ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎలక్షన్ ముందు ఏర్పాటు చేస్తే అది రాజకీయ లబ్ధి కోసం అన్నట్లుగా వస్తుంది. కానీ ఎలక్షన్ తర్వాత కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వలన ఎంతో మందికి లబ్ధి చేకూరుతుంది….
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రోత్బలంతో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు….
రానున్న రోజుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో, ఆదర్శంగా పేద ప్రజలకు విద్య వైద్యం మౌలిక వసతులు సమకూర్చడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టమన్నాను….
ఈ కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గ కూనపరెడ్డి నాని ( మండల ప్రధాన కార్యదర్శి)కొండూరు శ్రీహరి ( జనసేన సీనియర్ నాయకులు)కాట్రగడ్డ రాంబాబు( జనసేన సీనియర్ నాయకులు)పొదిలి దుర్గారావు( విజయవాడ రూరల్ మండలం అధ్యక్షులు)పాతూరి పుణ్యవతి( జనసేన సీనియర్ నాయకులు)మేకల స్వాతి( జనసేన వీర మహిళ)పోలిశెట్టి పవన్ కుమార్( జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్)పట్టపు పవన్ కుమార్( మండల కార్యదర్శి)పవన్ కళ్యాణ్
పట్టపు చంటి( టిడిపి సీనియర్ నాయకులు)రత్నం నాగేశ్వరరావు( రామవరప్పాడు గ్రామ అధ్యక్షులు)శీలం సాయి రంగారావు( జనసేన సీనియర్ నాయకులు)-కోలా సతీష్( జనసేన నాయకులు )అల్లిన మహేష్ ( ప్రసాదంపాడు గ్రామ అధ్యక్షులు )కూటమి నాయకులు పాల్గొన్నారు…..


Be the first to comment