27, డిసెంబర్, 2024 పంచాంగం
సూర్యోదయాస్తమయాలు:
ఉ 06.34 / సా 05.43
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి : తుల/వృశ్చికం
స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయణం
హేమంత ఋతౌః / మార్గశిర మాసం / కృష్ణపక్షం
తిథి : ద్వాదశి రా 02.26 వరకు ఉపరి త్రయోదశి
వారం : శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం : విశాఖ రా 08.28 వరకు ఉపరి అనూరాధ
యోగం : ధృతి రా 10.37 వరకు ఉపరి శూల
కరణం : కౌలువ మ 01.39 తైతుల రా 02.26 ఉపరి గరజి
సాధారణ శుభ సమయాలు
ఉ 06.30 – 08.30 సా 05.00 – 06.00
అమృత కాలం : ఉ 10.49 – 12.35
అభిజిత్ కాలం : ప 11.46 – 12.31
వర్జ్యం : రా 12.46 – 02.29
దుర్ముహూర్తం : ఉ 08.48 – 09.33 మ 12.31 – 01.16
రాహు కాలం : ఉ 10.45 – 12.09
గుళికకాళం : ఉ 07.58 – 09.21
యమగండం : మ 02.56 – 04.20
ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు
వైదిక విషయాలు
ప్రాతః కాలం : ఉ 06.34 – 08.48
సంగవ కాలం : 08.48 – 11.02
మధ్యాహ్న కాలం : 11.02 – 01.16
అపరాహ్న కాలం : మ 01.16 – 03.29
ఆబ్ధికం తిధి : మార్గశిర బహుళ ద్వాదశి
సాయంకాలం : సా 03.29 – 05.43
ప్రదోష కాలం : సా 05.43 – 08.18
రాత్రి కాలం : రా 08.18 – 11.43
నిశీధి కాలం : రా 11.43 – 12.35
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.52 – 05.43.
27-12-2024-శుక్రవారం రాశి ఫలితాలు:
మేషం
నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగతాయి. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. విలువైన వస్తు, వస్త్రలాభాలు అందుతాయి. నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. మిత్రుల నుండి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.
వృషభం
దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి.
మిధునం
సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆరోగ్య పరంగా చికాకులు తప్పవు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు.
కర్కాటకం
బంధు మిత్రులతో సఖ్యత కలుగుతుంది. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం పొందుతారు.
సింహం
చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాల వలన మార్గ అవరోధాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబసభ్యులతో విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి.
కన్య
ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.
తుల
చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. కుటుంబ సభ్యులతో వివాదాలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార, ఉద్యోగాలలో ఇబ్బందులు తప్పవు.
వృశ్చికం
నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
ధనస్సు
దీర్ఘాకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. సంఘంలో పేరు కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి.
మకరం
చేపట్టిన వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.
కుంభం
మిత్రులతో మాటపట్టింపులు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. నూతన రుణయత్నాలు చెయ్యవలసి వస్తుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. చేపట్టిన పనులు మందగిస్తాయి. వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు తప్పవు.
మీనం
కుటుంబ సభ్యులతో శుభాకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వాహనయోగం ఉన్నది. ఉద్యోగయత్నాలు సజావుగా సాగుతాయి. వ్యాపారాలలో ఆశించిన రీతిలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున జీతబత్యముల విషయంలో శుభవార్తలు అందుతాయి


Be the first to comment