విజయనగరం జిల్లా పోలీసు
పశువుల అక్రమ రవాణకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
– విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
వారం రోజుల్లో 11 కేసులు నమోదు చేసి, 12మందిని అరెస్టు చేసామన్న జిల్లా ఎస్పీ
11 వాహనాలను, 189 పశువులను సీజ్ చేసామన్న జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జిల్లాలో ఎవరైనా పశువుల అక్రమ రవాణకు పాల్పడితే, చట్టరీత్యా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ నవంబరు 10న హెచ్చరించారు.
జిల్లాలో పశువుల అక్రమ రవాణకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఇచ్చిన ఆదేశాలతో గత వారం రోజులుగా పోలీసు అధికారులు, సిబ్బంది జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బంది జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలను గత వారం రోజులుగా తమ పోలీసు స్టేషను పరిధిలో చేపట్టారు. ప్రధానంగా రాష్ట్రీయ రహదారికి ఆనుకొని వున్న రామభద్రపురం, బొబ్బిలి, బూర్జువలస, పెద మానాపురం పోలీసు స్టేషను పరిధిలో దాడులు, వాహన తనిఖీలు చేపట్టారు. పశువులను అక్రమ రవాణకు పాల్పడుతున్న వారిపై గత వారం రోజుల్లో 11 కేసులు నమోదు చేసి, 12మందిని అరెస్టు చేయడంతోపాటు, 11 వాహనాలను, 189 పశువులను సీజ్ చేసామని జిల్లా ఎస్పీ తెలిపారు. రామభద్రపురం పోలీసు స్టేషనులో ఒక కేసు నమోదు చేసి, ఒకరిని అరెస్టు చేసి, ఒక వాహనం సీజ్ చేసి, 8 పశువులను సీజ్ చేసారన్నారు. అదే విధంగా బొబ్బిలి పోలీసు స్టేషను పరిధిలో ఒక కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్టు చేసి, ఒక వాహనం, 32 పశువులను సీజ్ చేసారన్నారు. బూర్జువలస పోలీసు స్టేషను పరిధిలో 4 కేసులు నమోదు చేసి, నలుగురిని అరెస్టు చేసి, 4 వాహనాలను, 35 పశువులను సీజ్ చేసారన్నారు. అదే విధంగా పెద మానాపురం పోలీసు స్టేషను పరిధిలో 5 కేసులు నమోదు చేసి, 5గురిని అరెస్టు చేసి, 5 వాహనాలను 114 పశువులను సీజ్ చేసినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
పశువులను అక్రమ రవాణకు ఎవరైనా పాల్పడితే, వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ దాడుల్లో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయం,
విజయనగరం.


Be the first to comment