మహానాడులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్పీచ్ హైలైట్స

మహానాడులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్పీచ్ హైలైట్స

 

మహానాడు” అంటే నాటి నుంచి నేటి వరకు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా అదే జోరు.. అదే హోరు.

దేవుని గడపలో జరిగే మహానాడు చరిత్ర సృష్టించబోతోంది..ఈ మహానాడు దశ, దిశ నిర్దేశిస్తుందని గట్టిగా చెబుతున్నా.

కడప జిల్లాలో 10 స్థానాలకు 7 గెలిచి సత్తా చాటాం..వచ్చే ఎన్నికల్లో ఇంకొంచెం కష్టపడితే 10/10 స్వీప్‌ చేస్తాం.

2024 ఎన్నికల్లో 57 శాతం ఓట్లు సాధించాం..టీడీపీకి ఘన విజయం అందించిన తెలుగుదేశం కార్యకర్తలకు కృతజ్ఞతలు.

కార్యకర్తల పోరాటాలతో టీడీపీ అధికారంలోకి వచ్చింది.. పీక కోస్తుంటే కూడా జై టీడీపీ అని చంద్రయ్య ప్రాణాలు వదిలేశారు, చంద్రయ్య వంటి వారి స్ఫూర్తి టీడీపీని నడిపిస్తోంది..పసుపు సింహం తోట చంద్రయ్య.

కార్యకర్తల త్యాగాలకు శిరస్సు వంచి సమస్కరిస్తున్నా..త్యాగాలు చేసిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటాం.

దేశంలో ఏ పార్టీ ఎదుర్కోని సంక్షోభాలు ఎదుర్కొన్నాం..టీడీపీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ల పని అయిపోయింది..టీడీపీ జెండా ఎప్పటికీ రెపరెపలాడుతునే ఉంటుంది.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*