కర్నూలు నగర బలిజ సంఘం
BR Prathibha Awards – 2025
బలిజ రాయల్ ప్రతిభ పురస్కారాలు – 2025
ఇటీవల అనగా 2025 వ సంవత్సరంలో ప్రకటించిన పది మరియు ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన కర్నూలు నగరం మరియు నూతన కర్నూలు జిల్లా (కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం పరిధి) లోని బలిజ విద్యార్థులను “బలిజ రాయల్ ప్రతిభ పురస్కారాలతో” అభినందించాలని కర్నూలు నగర బలిజ సంఘం నిర్ణయించింది.
పదవ తరగతిలో 550 ఇంటర్మీడియట్ లో 950 మార్కుల పైన సాధించిన కర్నూలు నగర మరియు కొత్త కర్నూలు జిల్లా లోని బలిజ విద్యార్థులు ఈ ప్రతిభ పురస్కారాలకు అర్హులు.
విద్యార్థులలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురికి వరుసగా 5000/- 3000/- 2000/- రూపాయల నగదు బహుమతులు, మొమెంటో, ఫైల్, మరియు ప్రతిభ పురస్కార పత్రము అందజేయబడును.
మిగిలిన అర్హులైన మెరిట్ విద్యార్థులందరికీ మొమెంటో, ఫైల్, ప్రతిభ పురస్కార పత్రం అందజేయబడును.
అర్హులైన బలిజ విద్యార్థులు తమ మార్కుల జాబితాను, తమ పూర్తి చిరునామా మరియు ఫోన్ నెంబరు లను కర్నూలు నగర బలిజ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ మండ్లెం రవికుమార్ గారికి వాట్సాప్ (9000009440) ద్వారా పంపి తమ పేరు నమోదు చేసుకోవాలి.
నమోదు చేసుకొనుటకు ఆఖరి తేదీ : 22-5-2025
ప్రతిభ పురస్కారాల ప్రదాన కార్యక్రమం తేదీ : 25-05-2025 ఆదివారం ఉదయం 10 గంటలకు
వేదిక : TGV కళాక్షేత్రం, సి.క్యాంప్, కర్నూలు
కార్యక్రమానికి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హాజరు కావలసిందిగా విజ్ఞప్తి. ఎంతమంది హాజరవుతున్నారో దయచేసి 22 వ తేదీ తెలియజేయవలెను.
నమస్సులతో..
గాండ్ల లక్ష్మన్న
అధ్యక్షులు
పత్తి ఓబులయ్య
గౌరవాధ్యక్షులు
మండ్లెం రవికుమార్
ప్రధాన కార్యదర్శి
Cell : *9000009440
Dr సోమశేఖర్ సింగంశెట్టి
ప్రధాన సలహాదారులు
Cell: *9396743366
కోడుమూరు శైలేష్
కోశాధికారి
మరియు *కార్యవర్గ సభ్యులు
కర్నూలు నగర బలిజ సంఘం


Be the first to comment