తొలితరం_సహజనటి_జూనియర్_శ్రీరంజని
జూనియర్ శ్రీరంజని (అసలు పేరు మహాలక్ష్మి) తెలుగు సినిమా నటి. వీరు గుంటూరు జిల్లా మురికిపూడి గ్రామంలో 1927 సంవత్సరం ఫిబ్రవరి 22 న జన్మించారు. శ్రీరంజని సీనియర్ గా పేరుపొందిన తెలుగు సినిమా నటి ఈమె సోదరి. చిత్రపు నారాయణమూర్తి ప్రోత్సాహంతో మొదటిసారిగా భీష్మ (1944) చిత్రంలో నటించింది. 1949లో కె.వి.రెడ్డి దర్శకత్వంలో విడిదలైన గుణసుందరి కథలో కథానాయిక పాత్రలో నటించింది.ఈమె అనేక సాత్విక పాత్రలలో నటించి మెప్పించారు జూనియర్ శ్రీరంజని గారు. ఈమె 1974 సంవత్సరంలో ఏప్రిల్ 27 పరమపదించారు.
జూనియర్ శ్రీరంజని
జన్మ నామం మహాలక్ష్మి
1927 ఫిబ్రవరి 22
మురికిపూడి, గుంటూరు జిల్లా
మరణం
1974 ఏప్రిల్ 27 (వయసు: 47)
**నటించిన చిత్రాలు**
జీవన తరంగాలు (1973)
నేనంటే నేనే (1968)
బంగారు పంజరం (1965)
శ్రీకృష్ణార్జున యుద్ధం (1963) …. రుక్మిణి
మహాకవి కాళిదాసు (1960)
కృష్ణ లీలలు (1959)
ప్రేమే దైవం (1957)
శ్రీ గౌరీ మహత్యం (1956)
పెంకి పెళ్ళాం (1956)
సంతానం (1955) …. లక్ష్మి
శ్రీకృష్ణ తులాభారం (1955) …. రుక్మిణి
చంద్రహారం (1954) …. గౌరి
అమర సందేశం (1954)
పెద్ద మనుషులు (1954)
బ్రతుకు తెరువు (1953)
మానవతి (1952)
పరాశక్తి (1952) …. కళ్యాణి
ప్రేమ (1952) …. లత
రాజేశ్వరి (1952)
సంక్రాంతి (1952)
లైలా మజ్ఞు (1949)
గుణసుందరి కథ (1949) …. గుణసుందరి
గీతాంజలి (1948)
మదాలస (1948)
గృహప్రవేశం (1946)
భీష్మ (1944) …. సత్యవతి
నేడు జూనియర్ శ్రీరంజని గారి వర్ధంతి సందర్భంగా ఆత్మీయంగా స్మరిస్తూ… స్మృత్యంజలి..


Be the first to comment