కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం ములపర్రు గ్రామంలో “కీ”శే”లు శ్రీ వంగవీటి మోహన రంగా గారి విగ్రహావిష్కర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగినది. ముందుగా రంగా గారి తనయుడు వంగవీటి రాధా బాబు విగ్రహావిష్కరణ గావించినారు. ముఖ్య అతిథులుగా మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు గౌ:లు. వల్లభనేని బాలశౌరి గారు, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ గారు, మాజీ శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్ శ్రీ బూరగడ్డ వేదవ్యాస్ గారు, బీసీ సంఘం నాయకులు శ్రీ కొనకళ్ళ బుల్లయ్య గారు, ఆంధ్ర తెలంగాణ రాధా రంగా మిత్రమండలి అధ్యక్షులు.జనసేన నాయకులు బుల్లెట్ ధర్మారావు గారు పాల్గొనగా ఈ కార్యక్రమానికి కుల మతాలకు అతీతంగా రంగా గారి అభిమానులు,పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గ్రామస్తులు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం గావించినారు.🙏🙏


Be the first to comment