ఫిబ్రవరి నుంచి శరవేగంగా రాజధాని నిర్మాణ పనులు
అమరావతిలో పలు నిర్మాణ పనులకు ఏపీ సీఆర్‌డీఏ, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) టెండర్ల పిలిచింది.
▪️ రాజధాని ప్రాంతంలో పలు నిర్మాణాలకుగాను రూ. 2, 300 కోట్లకు బుధవారం టెండర్ల పిలిచింది.
▪️ సీఆర్‌డీఏ ద్వారా రూ. 1470 కోట్లు, ఏడీసీ ద్వారా రూ. 852 కోట్లు టెండర్లను పలిచాయి.
ఈ నిధులతో పలు జోన్లలో రహదారులు, మంచినీటి సరఫరా, పవర్ తదితర ట్రంక్ ఇన్ ఫ్రా పనుల చేపట్టనున్నారు. అలాగే మరికొన్ని జోన్లలో నీరుకొండ రిజర్వాయర్‌కు సంబంధించి.. బ్యాలెన్స్ ఫ్లడ్ మిటికేషన్ నిర్మాణ పనులకు సైతం టెండర్లను పిలిచాయి. అయితే ఈ టెండర్లు వేసేందుకు తుది గడువు జనవరి 22వ తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. సంక్రాంతి వరకు సుమారు రూ. 31 వేల కోట్ల మేర నిర్మాణాలకు టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది.


Be the first to comment