తేదీ … 26 – 12 – 2024 పంచాంగం

 

తేదీ … 26 – 12 – 2024,
వారం … బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
మార్గశిర మాసం,
బహుళ పక్షం,

తిథి : *ఏకాదశి* రా11.27 వరకు,
నక్షత్రం : *స్వాతి* సా5.39 వరకు,
యోగం : *సుకర్మ* రా10.30 వరకు,
కరణం : *బవ* ఉ10.26 వరకు
తదుపరి *బాలువ* రా11.27 వరకు,

వర్జ్యం : *రా11.47 – 1.33*,
దుర్ముహూర్తము : *ఉ10.10 – 10.54*,
మరల *2.33 – 3.16*,
అమృతకాలం : *ఉ7.56 – 9.42*,
రాహుకాలం : *మ1.30 – 3.00*,
యమగండం : *ఉ6.00 – 7.30*,
సూర్యరాశి : ధనుస్సు,
చంద్రరాశి : తుల,
సూర్యోదయం : 6.32,
సూర్యాస్తమయం: 5.28,

*_నేటి విశేషం_*

*సఫల ఏకాదశి*
మార్గశిర మాసములో వచ్చే విశిష్టమైన తిథి మార్గశిర కృష్ణ ఏకాదశి.
ఈ సఫల ఏకాదశి రోజున దీపదానం చేస్తే జీవితంలో విశేషమైన ఫలితాలు కలుగుతాయి.

పరమపావనమైన ఈ రోజున ఇంటిలో లక్ష్మినారాయణులను భక్తితో పూజించి, పాలను నైవేద్యంగా ఉంచి, విష్ణు సహస్రనామములను, విష్ణు అష్టోత్తరములను పారాయన చేసి, పాలు, పండ్ల వంటి సాత్వికాహారం తీసుకొని ఉపవాసం ఉండాలి.
దగ్గర్లోని వైష్ణ్వవాలయాన్ని సందర్శించండి, మరియు ఈ రోజున నిత్య పూజ, ఉపవాసాది కార్యక్రమములను చేయడం ద్వారా విశేషమైన సిరిసంపదలు కలుగుతాయి, సమస్త పాపముల నుండి విడివడి వైకుంఠ ప్రాప్తిని పొందుతారు.

ఈ ఏకాదశిని విష్ణుప్రీతిగా భక్తి, శ్రద్ధలతో చేయడం రాజసూయయాగం చేసిన దానితో సమానం.
అంతేకాక విశేషంగా సిరిసంపదలను పొందుతారని శ్రీకృష్ణపరమాత్మ ధర్మరాజుకి బోధించారు.
“పక్షులలో గరుత్మంతుడు, శేషులలో ఆదిశేషుడు, నదులలో గంగ, దేవతలలో విష్ణుభగవాణుడు, మనుషులలో బ్రాహ్మణుడు, యజ్ఞాలలో అశ్వమేధయాగం, అయితే ఎలా గొప్పవారో అలాగే ఉపవాసాలన్నింటిలో ఏకాదశి ఉపవాసం అంత గొప్పది” – బ్రహ్మ వైవత్తర పురాణం.

🍀 చేయవలసినవి 🍀

🍀- దగ్గరలోనున్న వైష్ణవ ఆలయాన్ని సందర్శిస్తే విశేషంగా విష్ణు భగవానుడి అనుగ్రహం పొందుతారు.

🍀- రోజంతా కృష్ణ, మాధవ, గోవింద అని హరినామాన్ని జపించండి.

🍀- మద్యపానం మాంసాహారం వంటి పాపకర్మలకు దూరంగా ఉండండి.

🍀ఏకాదశి రోజున ధాన్యంతో(బియ్యం, గోధుమ, బార్లే వంటివి) చేసిన ఆహారం నిషిద్ధము కావున పాలు, పండ్లు వంటి సాత్వికమైన ఆహారం స్వీకరించవచ్చు.

 

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*