అన్నమయ్య జిల్లాలో తుపాకీ చప్పుడు 

అన్నమయ్య జిల్లాలో తుపాకీ చప్పుడు

అన్నమయ్య జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి వ్యాపారులే టార్గెట్‌గా దుండగులు రెచ్చిపోయా రు. ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో అక్కడు న్న వారు తీవ్ర భయాందో ళనలకు గురయ్యారు.

ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అన్నమయ్య జిల్లాలో ఇద్దరు పాత సామాన్ వ్యాపారులపై తుపాకులతో దాడి చేయడం సంచలనం కలిగించింది. పోలీసులు రంగంలోకి దిగి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే…

అన్నమయ్య జిల్లాలో ఇవాళ ఉదయం రాయచోటి మండలం మాధవరంలో ఇద్దరిపై దుండగులు కాల్పులకు దిగారు. విచక్షణ రహితంగా తుపాకులతో దాడులకు పాల్పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

పాత సామాగ్రి వ్యాపా రులపై గుర్తుతెలియని దుండగులు తుపాకీతో కాల్పులు జరపడంతో అన్నమయ్య జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దుండగుల కాల్పుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

పోలీసులకు సమచారం అందండతో సంఘటన జరిగిన స్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతు న్నారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

వారి కదలికల కోసం దగ్గరలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కాల్పులు జరిపిన ఇద్దరికి ఎవరితో నైనా గొడవలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నా రు. అసలు దుండగులు ఎక్కడి నుంచి వచ్చారు. కాల్పులు జరపడానికి గల కారణాలు ఏంటనే దానిపై పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు జరుపుతున్నారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*