బలిజ సంఘీయులకు నామినేటెడ్ పదవులలో తగిన ప్రాధాన్యత నివ్వాలి – కర్నూలు నగర బలిజ సంఘం
కూటమి ప్రభుత్వం కల్పిస్తున్న నామినేటెడ్ పదవులలో కర్నూలు నగరం మరియు జిల్లాలోని బలిజ కులస్థులకు తగిన అవకాశం కల్పించాలని, వారి అర్హత ల మేరకు అవకాశం ఉన్న ప్రతి చోట బలిజ వారికి వీలైనన్ని ఎక్కువ పదవులు ఇవ్వాలని, రాష్ట్ర స్థాయి డైరెక్టర్లు, సభ్యులు గానూ జిల్లా స్థాయి లో ఛైర్మన్ లు, డైరెక్టర్లు, సభ్యులు గానూ అవకాశం కల్పించాలని జిల్లా మంత్రి శ్రీ టి.జి.భరత్ గారిని అభ్యర్థించి ఆ మేరకు వెంటనే చర్యలు చేపట్టాలని వినతిపత్రం అందజేసారు.
సంఘం వినతి పై మంత్రివర్యులు శ్రీ టి.జి.భరత్ గారు స్పందిస్తూ తప్పక కృషి చేస్తానని, కేవలం రెకమెండేషన్ లెటర్స్ ఇవ్వడమే కాకుండా ఇప్పటికే విజయవాడ లోని TDP కేంద్ర కార్యాలయంలోని బాధ్యులతో ఆ మేరకు మాట్లాడానని తెలిపారు. తప్పకుండా బలిజ వారికి తగు ప్రాతినిధ్యం కల్పిస్తానని మాట ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు నగర బలిజ సంఘం అధ్యక్షులు శ్రీ జి.లక్ష్మన్న, ప్రధాన కార్యదర్శి శ్రీ రవికుమార్, కోశాధికారి శ్రీ శైలేష్, పెద్దలు శ్రీ పత్తి ఓబులయ్య, శ్రీ అర్జా రామకృష్ణ, శ్రీ విజయభాస్కర్, శ్రీ స్వామిరెడ్డి, శ్రీ సోమశేఖర్, శ్రీ శోభన్ బాబు, శ్రీ ఈశ్వర్ కుమార్, శ్రీ సుబ్బరాయుడు, శ్రీ ఆంజనేయులు, శ్రీమతి హేమలత, శ్రీ శేషు, శ్రీ శ్రీనివాసులు, బైరెడ్డి రవి, శ్రీ రాము, శ్రీ వాసు & టీం, శ్రీ రాజేంద్ర & టీం మరియు కర్నూలు నగర బలిజ సంఘ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


Be the first to comment