అలిశెట్టి కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయం అందించిన జనసేన నేత :- శంకర్ నాయుడు

అలిశెట్టి కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయం అందించిన జనసేన నేత :- శంకర్ నాయుడు

*రాచర్ల :-*
గిద్దలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి బెల్లంకొండ సాయిబాబు గారి ఆదేశాల మేరకు ఇటీవల మరణించిన జనసైనికుడు అలిశెట్టి విజయ్ కుటుంబాన్ని రాచర్ల మండల జనసేన నాయకులు పరామర్శించారు.వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.అనంతరం శంకర్ నాయుడు తన సొంత నిధుల నుంచి పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు.ఇది చిన్న సహాయం అని పార్టీ నాయకులతో చర్చించి అండగా ఉంటామని తెలిపారు. చిన్న వయసులో అలిశెట్టి విజయ్ మరణించడం అతనికి మూడు సంవత్సరాల బాబు మరియు అతని భార్య ఇప్పుడు నిండుసులాలు ఉండటం చాలా బాధాకరమైన విషయం తెలియజేశారు. జనసేన నాయకులు మరింత ముందుకు వచ్చి విజయ్ కుటుంబాన్ని ఆదుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అలిశెట్టి వెంకటేశ్వర్లు,లంక జనార్ధన్,చిన్న,బాలుడు,రవితేజ,సాగర్,లింగమయ్య,హరి, షేక్ రియాజ్ మరియు మండల జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*