సంగీత దర్శకుడు పసుపులేటి రమేష్ నాయుడు గారి జయంతి –

సంగీత దర్శకుడు పసుపులేటి రమేష్ నాయుడు గారి జయంతి

రచ్చ గెలిచి ఇంట గెలిచిన సంగీతజ్ఞుడు శ్రీ రమేష్ నాయుడు గారు సాలూరి, రమేష్ నాయుడు .. వీరంతా అతి పిన్న వయస్సులోనే అనేక చిత్రాలకు సంగీతం చేసిన గొప్ప వారు.

శ్రీ రమేష్ నాయుడు పదిహేడేళ్ల వయసుకే సంగీత దర్శకత్వం చేయడం ఆరంభించారు.. వారిలోని ప్రజ్ఞ తెలిసిన ఎందరో ఉద్ధండులను తెరకు పరిచయం చేసిన మీర్జాపురం రాణి కృష్ణవేణి గారు తాము తీస్తున్న దాంపత్యం 1957 చిత్రానికి సంగీతం చేయమని బొంబాయిలో ఉన్న రమేష్ నాయుణ్ణి పిలిపించి సంగీతం చేయించారు.

అందులో “తానేమి తలంచేనో ” రావు బాల సరస్వతీ దేవి ఏ ఎం రాజా గారు పాడినది సూపర్ హిట్. ఆ చిత్రం తరువాత మనోరమ 1959 చిత్రానికి సంగీతం చేసాక ఆయన బొంబాయి వెళ్లి పోయి ఆ తరువాత అనేక బెంగాళీ చిత్రాలకు సంగీతం చేసారు.మనోరమ చిత్రములో చందమామ రావే, అందాల సీమ సుధానిలయం, గతిలేని గుడ్డి వాణ్ణి బాబయ్యా మరచిపోయేవేమో పాటలు శ్రావ్యంగా ఉండి మంచి పేరు తెచ్చుకున్నాయి.. తల మహ్మద్ చేత తెలుగులో పాడించిన ఘనత వీరిదే .

1970 మళ్ళీ తెలుగు తెరకు వచ్చేరు అతి తక్కువ వాయిద్యాలతో మధురమైన సంగీతం అందించడం ఈ స్వర స్రష్టకే సాధ్యం. ఏక్ తార మీద “జోరు మీదున్నావా తుమ్మెద” పాట ను సృష్టించడం అంటే మాటలా.. ఆయన ఎక్కువగా దాసరి, విజయ నిర్మల, జంధ్యాల గారి చిత్రాలకే సంగీతం చేసారు. ఆయన అనేక వాయిద్యాలు వాయించడములోనూ నిష్ణాతులే .. వారు చేసిన దాదాపు అన్ని చిత్రాలలోని పాటలు వాయిద్యాల హోరు లేకుండా సాహిత్యాన్ని సుస్పష్టంగా వినగలిగేట్టు , మనసుకి హాయి చేకూరేట్టు చేస్తాయి.

మేఘ సందేశం చిత్రానికి గానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా 1982 లో నేషనల్ అవార్డు వరించింది.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*