ఆర్థికంగా ఆదుకుంటే అంతర్జాతీయ క్రీడాకారిణిని అవుతా

ఆర్థికంగా ఆదుకుంటే అంతర్జాతీయ క్రీడాకారిణిని అవుతా…!

విద్యార్థికి ఆర్దిక సహాయం చేసిన కడియపులంక సర్పంచ్ రాంజీ.

కడియపులంక (కడియం )

రాజమండ్రి రూరల్ బొమ్మూరు ట్రైబల్ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న కె దివ్యశ్రీ ఏ క్రీడలకు వెళ్లినా పతకం రావలసిందే… ఇలాంటి రత్నాలకు ఆర్థిక సహాయం తోడైతే జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని రాష్ట్రానికే కాదు దేశానికే మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే సత్తా ఈ విద్యార్థులో ఉంది. అయితే నేపాల్ లో జరిగే అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనేందుకు ఈ విద్యార్థికి అవకాశం రావడంతో ఆర్థికలోటు వలన ఈ క్రీడలకు హాజరవ్వలేకపోతున్నట్లు స్థానికుల ద్వారా తెలుసుకున్న కడియం మండలం కడియపులంక సర్పంచ్ పాఠంశెట్టి రాంజీ వెంటనే స్పందించి ఈ విద్యార్థికి రూ.10 వేలను అందజేశారు. ఈ విద్యార్థి ఉన్నతకి మరింత ఆర్థిక సాయం అందించేందుకు ముందుంటానని హామీ ఇచ్చారు. ఇలాంటి ఆణిముత్యాలను వెలుగులోకి తెచ్చేందుకు ఎవరైనా దాతలు ఉంటే ఆర్థిక సహాయం చేయాలని ఆయన కోరారు. సర్పంచ్ వెంట కట్టా శివ, గాద నాగేశ్వరరావు పాల్గొన్నారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*