తులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి 52వ ఆరాధన మహోత్సవములు ఘనంగా జరుగుతున్నాయి

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి 52వ ఆరాధన మహోత్సవములు ఘనంగా జరుగుతున్నాయి

శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను మన ముందుంచారని , ఆయన చెప్పిన అనేక విషయాలు బ్రహ్మంగారి కాలజ్ఞానంగా ప్రాచుర్యం పొందాయని ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అద్యక్షుడు , ఖమ్మం 3 టౌన్ ఏరియా కోఆర్డినేటర్ యర్రం బాలనగర్ తిలక్ తెలిపారు .

ఖమ్మం : శ్రీ శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ శ్రీ శ్రీ . ఆరాధన మహోత్సవాల సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా యర్రం బాలనగర్ తిలక్ పాల్గొని అన్న ప్రసాద వితరణను లాంఛనంగా ప్రారంభించారు . పటిష్టమైన కుటుంబ వ్యవస్థ , ప్రాచీన నాగరికత , సుదీర్ఘ చరిత్ర కలిగిన అనేక అంశాలను బ్రహ్మంగారు చెప్పినవి జరిగినట్లు భక్తుల విశ్వాసం అని ఆయన తెలిపారు . బ్రహ్మంగారు తెలుగు నాట జన్మించడం మనందరికీ గర్వకారణం అని తెలిపారు. బ్రహ్మంగారి కాలజ్ఞాన తాళ్లపత్ర గ్రంధాలు నేటికీ భద్రపరిచి ఉండటం విశేషమని తెలిపారు. గోవింద వాక్యాలుగా పేరుందిన 320 పద్య రూపంలో ఉన్నట్లు భక్తుల ద్వారా తెలుస్తోందని తెలిపారు . శ్రీ శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి 52వ ఆరాధన మహోత్సవములో ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి యర్రం బాలగంగాధర్ తిలక్ , వేగలం శ్రీనివాసరావు , బాణాల లక్ష్మణ్ , కొంకిమళ్ళ వేణు , గడ్డం శ్రీనివాసరావు , విజయగిరి సదానంద చారి , జాన పాముల చలపతి రావు , వంగ లక్ష్మణ్ , బూరెల లక్ష్మీనారాయణ , గొన్న బత్తుల వెంకటేశ్వరరావు , గౌరోజు వసంత బాబు , కొమ్మోజు శ్రీనివాసరావు , కుప్పిలి వెంకటాచారి , పెదగాడ అవినాష్ , నామగిరి సంతోష్ , కడియం నాగకృష్ణ ,బంగారు వినయ్ కుమార్ , బులియన్ మర్చంట్స్ సభ్యులు , స్వర్ణకార సంఘ సభ్యులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారని స్తంభాద్రి ఖమ్మం నగర్ స్వర్ణకార సంఘం ఖమ్మం అధ్యక్షులు కడలి పరబ్రహ్మం , ప్రధాన కార్యదర్శి చిట్టో జుచిదంబరాచారి , కోశాధికారి ఉప్పరాపల్లి దుర్గాప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు .

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*