ప్రభుత్వ ఉద్యోగి కిడ్నాప్..
కృష్ణా జిల్లా : మచిలీపట్నం
కృష్ణా జిల్లా మచిలీపట్నం డిఇఓ ఆఫీస్ లో అటెండర్ గా పనిచేస్తున్న కొల్లూరి జయరాజ్…
మచిలీపట్నం రైల్వే స్టేషన్ వైఎస్ఆర్ నగర్ కాలనీ చెందిన కొల్లూరి జయరాజు బుధవారం నాడు డిఇఓ ఆఫీస్ డ్యూటీకి వెళ్లి సాయంత్రానికి ఇంటికి తిరిగి రాలేదు….
బుధవారం సాయంత్రం జయరాజును గుర్తు తెలియని వ్యక్తులు అతను వెంటపడి రెండు ఆటోలో వచ్చి జయరాజును కొట్టి కిడ్నాప్ చేశారు…
జయరాజు భార్య మేరికుమారి రైల్వే స్టేషన్ కి వెళ్లి చూడగా జయరాజు బండి కనిపించింది.
మేరీ కుమారి కు అనుమానం వచ్చి అక్కడున్న స్థానికులను అడిగి తెలుసుకుంది.
స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం రెండు ఆటోలో వచ్చి అతని కొట్టి ఆటో లో తీసుకెళ్లిపోయారని అక్కడ చూస్తున్న స్థానికులు మేరికుమారి కి చెప్పారు.
దిక్కు తోచని స్థితిలో మీడియాని ఆశ్రయించింది…


Be the first to comment