ఎన్.డి.ఏ. అభ్యర్థులకు మద్దతుగాపవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో ప్రచారం

ఎన్.డి.ఏ. అభ్యర్థులకు మద్దతుగాపవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో ప్రచారం

రెండు రోజులపాటు మహారాష్ట్ర పర్యటన
 5 సభలు… 2 రోడ్ షోలు

జనసేన అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో రెండు రోజులపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో ఎన్.డి.ఏ. కూటమి అభ్యర్థులకు మద్దతుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రచారం నిర్వహిస్తారు. ఈ నెల 16, 17 తేదీల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు.  మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర రీజియన్లలో ప్రచారం షెడ్యూల్ ఖరారు నిమిత్తం  బి.జె.పి. జాతీయ స్థాయి, మహారాష్ట్ర నాయకులు జనసేన నాయకులతో చర్చించారు. ఇందులో భాగంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయిదు బహిరంగ సభల్లో, రెండు రోడ్ షోల్లో పాల్గొంటారు.
మొదటి రోజు మరట్వాడా ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. 16వ తేదీ ఉదయం నాందేడ్ జిల్లా డెగ్లూర్ నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అదే జిల్లాలోని భోకర్ నియోజకవర్గానికి వెళ్తారు. అక్కడ నిర్వహించే సభలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 గం.కు. లాతూర్ చేరుకుంటారు. అక్కడ నిర్వహించే సభలో పాల్గొంటారు. రాత్రి 6గం.కు షోలాపూర్ నగరంలో రోడ్ షోలో పాల్గొంటారు.
17వ తేదీ విదర్భ ప్రాంతానికి వెళ్తారు. ఆ రోజు ఉదయం చంద్రపూర్ జిల్లాలోని బల్లార్ పూర్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం పుణె కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం కస్బా పేట్ నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*