2025 జనవరి 5వ తేదీ విజయవాడలో “హైంధవ శంఖారావం”

2025 జనవరి 5వ తేదీ విజయవాడలో “హైంధవ శంఖారావం”
– లక్షలాదిగా హిందూబంధువులు తరలిరావాలని పిలుపు.

ఒంగోలు::

దేశ స్వాతంత్రం సిద్ధించి 77 సంవత్సరాలు పూర్తి అయిన హిందువులకు మాత్రం తమ దేవాలయాలను తాము నిర్వహించుకునే స్వతంత్రత నేటికీ రాకపోవడం అంతేకాకుండా ఆలయాల పాలనపై ప్రభుత్వ ప్రత్యక్ష అధికారం తో ఆలయాల వ్యవస్థను హిందూ సనాతన ధర్మాన్ని కాలరాస్తున్న పరిస్థితిని హిందూ విశ్వాసాలపైతీవ్రమైన దాడి జరగడం, పురాతన ఆలయాలు, దేవతా మూర్తుల ప్రతిమలను ధ్వంసం, అంతేకాకుండా ఆలయాల నిధులు దారి మళ్లించడం, భూములను కబ్జాచేయడం, రాజకీయ సెక్యులర్ ముసుగులో హిందూ దేవాలయాలను తమ చేతుల్లో ఉంచుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఒక పథకం ప్రకారం ఆలయ వ్యవస్థను ధ్వంసం చేస్తూ తద్వారా హిందూ సమాజంలో ఐక్యత కొరవడేటట్టు చేస్తున్నారు. దానిలో భాగంగా పుణ్యస్థలి తిరుమల దేవస్థాన ప్రసాదం పవిత్రత విషయంలో వెలువడిన సమాచారం ప్రపంచవ్యాప్తంగా హిందువులు దిగ్భ్రాంతికి గురైనారు. ఆలయాల్లో అన్యమతస్తులను ఉద్యోగులుగా చేర్చి హిందూమత విశ్వాసాల పై దాడులను సాగిస్తున్నారు అని వక్తలు పేర్కొన్నారు విశ్వహిందూ పరిషత్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీ విజయవాడ లో నిర్వహిస్తున్న హైందవ శంఖారావం బహిరంగ సభ సన్నాహక సమావేశం స్థానిక ఆంధ్రకేసరి విద్యా కేంద్రంలో ఆదివారం ఉదయం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగింది.

సమావేశం లో పలువురు హిందూ వివిధ క్షేత్రాల ప్రతినిధులు ప్రసంగించారు. ఈ సందర్భంగా భైరవిశ్వరానంద స్వామి శంఖానాదం పూరించగా వేదమంత్రోచ్ఛారణల మధ్య హైందవ శంఖారావం బహిరంగ సభ కరపత్రాలను ఆవిష్కరించారు. మన దీక్ష దేవాలయాల రక్ష అంటూ నినదించారు. దేవాలయాల ఆదాయాన్ని కేవలం ధర్మ ప్రచారానికి సేవలకు మాత్రమే ఉపయోగించాలి హిందూ సమాజం ఆలయాలపై ఉన్మాదంతో కుట్రపూరితంగా దాడులు చేస్తున్న విదర్మీయులను విద్రోహులను ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలి ఆలయాల నిర్వహణలో అన్యమతస్తులను తొలగించాలి ధర్మాచార్యులు తయారుచేసిన నమూనా విధివిధానాలను అమలు చేయాలని విజయవాడలో హైందవ శంఖారావం జనవరి 5వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు లక్షలదిగా హిందూ బంధువులు పాల్గొని ఉద్యమానికి బాసటగా ఊపిరిగా నిలవాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో సమరస్త సేవ ఫౌండేషన్ వెంకట్, సున్నపు తిరుపతిరావు, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లికార్జునరావు, విశ్వహిందూ పరిషత్ ప్రాంత సత్సంగ ప్రముఖు సోమ సుబ్బారావు, విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఇనమనమెల్లూరి సీతారామయ్య, ఆర్ఎస్ఎస్ మండవ నాగేశ్వరరావు, తిరువై కుమార్, కోదండరాం, ఏబీవీపీ అంకిరెడ్డి, బిజెపి యోగయ్య యాదవ్, కృష్ణారెడ్డి, శివాజీ, సేవికా సమితి దేవకుమారి, మద్దు అరవింద లక్ష్మి తదితర హిందూ ధార్మిక సంస్థల ప్రముఖులు పాల్గొన్నారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*