ఎన్టీఆర్ జిల్లా,మైలవరం
వైద్యరంగంలో మైలవరం పరిసర ప్రాంత ప్రజలకువిశేష సేవలు అందిస్తున్న మహదేవ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ హరిప్రసాద్ గారిని వరించిన ఎన్టీఆర్ అవార్డు
వైద్య సేవలకు గుర్తింపు గా ఇటీవల ఎన్టీఆర్ జాతీయ అవార్డు పొందిన మహదేవ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ హరిప్రసాద్ గారిని మైలవరం జనసేనపార్టీ నాయకులు కలిసి ఆయన సేవలను కొనియాడుతూ ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య మాట్లాడుతూ మహదేవ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ హరిప్రసాద్ గారికి ఎన్టీఆర్ అవార్డు రావటం మైలవరం ప్రాంత ప్రజలకు ఎంతో గర్వకారణం అని,మరెన్నో మెరుగైన వైద్యసేవలు పరిసర ప్రాంత ప్రజలకు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ మైలవరం మండల ఉపాధ్యక్షులు పడిగల ఉదయ్,టౌన్ అధ్యక్షులు గజరావు శ్రీనివాసరావు,ఉపాధ్యక్షులు జీ.వీ.రవితేజ,నాయకులు చంద్రాల మురళీకృష్ణ,ఉయ్యూరు నాగరాజు,కూసుమంచి కిరణ్ కుమార్,మాదాసు సుబ్బారావు,A.శివరాం ప్రసాద్,వీర్ల పౌల్ రాజ్,ఎడ్ల సుధాకర్,పుప్పాల శ్రావణ్,తోట మాధవరావు, మేరుగ నాగార్జున(నాని),పామర్తి నరేష్,పెద్దారపు సాయి కృష్ణ,కళ్యాణ్,బచ్చు ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.


Be the first to comment