సరస్వతి నది పుష్కరలు
మే 15 నుంచి మే 26వ తేదీ వరకు పుష్కరాలు.
*భారతదేశ చరిత్ర, పురాణాలలో సరస్వతి నదికి ఎంతో ప్రాధాన్యత ఉంది. త్రివేణి సంగమంలో సరస్వతి నది కూడా ఓ భాగం. పురాణాలు, చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన సరస్వతి నది ప్రస్తుతం కనిపించదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇక త్వరలోనే ఈ నది పుష్కరాలు రాబోతున్నాయి.*
—————————————-
*భారతదేశం ఎన్నో పవిత్ర నదులకు పుట్టిల్లు. పంచభూతాల్లో ఒకటైన నీటిని మన దేశంలో పరమ పవిత్రంగా భావిస్తాం. అందుకే ఆ నీరు ప్రవహించే నదులను కూడా పూజిస్తాం… వాటిల్లో స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని… సమస్యలు తీరుతాయని నమ్ముతాం. మన దేశంలో చాలా నదులకు పురాణాల్లో అత్యంత ప్రాముఖ్యత ఉంది. వాటిల్లో ఒకటి సరస్వతి నది. రుగ్వేదంలో దీని గురించి ప్రస్తావన ఉంది. సరస్వతి నది గురించి రుగ్వేదంలో*
*”అంబితమే, నదీతమే, దేవీతమే” (ఉత్తమ తల్లి, ఉత్తమ నది, ఉత్తమ దేవత)గా కీర్తించారు. సరస్వతి నది ఒకప్పుడు భారతదేశంలోని వాయవ్య ప్రాంతంలో ప్రవహించిందని చెబుతారు.*
—————————————-
*సరస్వతీ నది జన్మస్థలం… ప్రవాహ తీరం…*
—————————————
*సరస్వతీ నది హిమాలయాల నుంచి ప్రారంభమై… భారతదేశంలోని అనేక రాష్ట్రాల గుండా ప్రవహించి… చివరకు అరేబియా సముద్రంలో కలుస్తుందని పురాతన గ్రంథాలు, భూగర్భ శాస్త్రవేత్తల అధ్యయనాలు సూచిస్తున్నాయి. రుగ్వేదంలో సరస్వతి నది యమునా, సట్లెజ్ నదుల మధ్య ప్రవహించినట్లు పేర్కొనబడింది. దీని ఆధారంగా… సరస్వతీ నదిని ఆధునిక కాలంలో గగ్గర్-హక్రా నది వ్యవస్థగా గుర్తించారు. ఈ నది హిమాచల్ ప్రదేశ్‌లోని శివాలిక్ కొండల నుంచి ప్రారంభమై, పంజాబ్, హర్యానా, రాజస్తాన్ రాష్ట్రాల గుండా ప్రవహించి… గుజరాత్‌లోని రణ్ ఆఫ్ కచ్ వద్ద సముద్రంలో కలిసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ నది మనకు కనిపిస్తుందా అంటే లేదు. సుమారు 4000-5000 సంవత్సరాల క్రితం చోటు చేసుకున్న భౌగోళిక, వాతావరణ మార్పుల వల్ల ఈ నది ఎడారిలో… తన ఆనవాళ్లను వదిలి అదృశ్యమైందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.*
————————————
*ప్రస్తుతం, సరస్వతీ నది భూగర్భంలో ప్రవహిస్తుందని, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉపరితలంపై కనిపిస్తుందని నమ్మకం. ఉత్తరాఖండ్‌లోని మన గ్రామం (మానా విలేజ్) సమీపంలో, బదరీనాథ్ వద్ద అలకనంద నదితో కలిసే సరస్వతీ నదిని ఒక ఉపనదిగా గుర్తిస్తారు. దీని ప్రకారం… సరస్వతీ నది హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్తాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో చారిత్రక సంబంధం కలిగి ఉంది.*
————————————–
*ప్రారంభం ఎక్కడంటే…*
————————————–
*సరస్వతీ నది ఆరంభం గురించి ప్రధానంగా రెండు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వీటిల్లో ఒకటి పురాతనమైనది కాగా… మరోకటి శాస్త్రీయమైనది. ఇక పురాణాల ప్రకారం చూసుకుంటే… సరస్వతీ నది బ్రహ్మదేవుని కమండలం నుంచి ఉద్భవించి, హిమాలయాల్లోని ప్లక్ష వృక్షం వద్ద ప్రారంభమైందని చెబుతారు. అలానే శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం చూసుకుంటే… సరస్వతి నది హిమాచల్ ప్రదేశ్‌లోని శివాలిక్ కొండల్లోని హర్-కీ-దూన్ హిమానీనదం (గ్లేసియర్) నుంచి ఉద్భవించిందని కొన్ని కొందరు చెబుతుండగా… గర్వాల్ ప్రాంతంలోని బందర్‌పూంచ్ మాసిఫ్ వద్ద ప్రారంభమైందని మరొక అభిప్రాయం ఉంది.*
————————————–
*ఈ నది సట్లెజ్, యమునా నదులతో సంబంధం కలిగి ఉండేదని, తర్వాత భూకంపాల వల్ల దాని మార్గం మారిపోయిందని భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని మన గ్రామంలో సరస్వతీ నది ఉపరితలంపై కనిపించి, అలకనందలో కలుస్తుంది. కనుక మానా గ్రామం సరస్వతి నది ఆధునిక ఆరంభ స్థానంగా పరిగణిస్తున్నారు.*
—————————————-
*చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత..*
————————————–
*సరస్వతీ నది ఒకప్పుడు హరప్పా నాగరికతకు జీవనాధారంగా ఉండేదని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనాలు సూచిస్తున్నాయి. నాటి ప్రజలు ఈ నదిని జ్ఞాన దేవతగా పూజించారు. సరస్వతి నది పుష్కరాలు భక్తులకు ఆధ్యాత్మిక శుద్ధిని, మోక్షాన్ని అందిస్తాయని నమ్మకం. పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి ఈ నదిలో పవిత్ర స్నానం ఆచరిస్తారు.*
—————————————
*మిగతా నదుల మాదిరే 12 సంవత్సరాలకు ఒకసారి సరస్వతీ నది పుష్కరాలు వస్తాయి. ఇది బృహస్పతి (గురు గ్రహం) మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు జరుగుతుంది. ఈ సారి 2025, మే 15 నుంచి మే 26 వరకు సరస్వతీ నది పుష్కరాలు జరగనున్నాయి.*
————————————-
*నదీస్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మంగళ స్నానాలు హిందువుల సాంప్రదాయం. అలాగే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల దర్శనం కూడా నీటితో ముడిపడి ఉంది. నదీ స్నానాలలో పుష్కర స్నానం పుణ్యప్రదమని పురాణాల ద్వారా తెలుస్తోంది. జీవరాశులకు నీటి ఆవస్యకత… ప్రాముఖ్యతను పుష్కరాలు గుర్తు చేస్తాయి.*
*ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు 12 రోజులపాటు సరస్వతీనది పుష్కరాలు వైభవంగి జరుగనున్నాయి . ఈ సమయంలో సరస్వతి నదితీరంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు. ఏ నదిలో పుష్కరాలు జరుగుతున్నాయో ఆ నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తే పాపాల నుంచి విముక్తి కలుగుతుందని సరస్వతి నది పుష్కరాలకు సిద్ధమవుతుంది. తెలంగాణలోని కాళేశ్వరంలో సరస్వతినదిలో పవిత్ర స్నానాలు చేసేందుకు భక్తులు సిద్దమవుతున్నారు.*
*తెలంగాణలోని కాళేశ్వరంలో గోదావరి – ప్రాణహితలతో పాటుగా సరస్వతి కూడా అంతర్వాహినిగా ప్రవహిస్తోందని నమ్మకం అందువల్ల కాళేశ్వరంలో పుష్కరాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
*సరస్వతి పుష్కరాలు 2025*
*మే 15 నుండి 26, 2025 వరకు*
*తెలంగాణలోని కాళేశ్వరంలో జరుగుతాయి.*
*సరస్వతి నదిలో పవిత్ర స్నానాలు చేయడం దైవిక ఆశీర్వాదాలను తెస్తుందని మరియు పాపాలను కడిగివేస్తుందని నమ్ముతూ భక్తులు స్నానాలు చేస్తారు.*
*బృహస్పతి మిథున రాశి (మిథునం)లోకి ప్రవేశించినప్పుడు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ పండుగ జరుపుకుంటారు.*
*సరస్వతి పుష్కరాలు 2025 యొక్క ముఖ్య అంశాలు :*
*స్థానం :
*కాళేశ్వరం, తెలంగాణ
*తేదీలు :*
*మే 15 నుండి 26, 2025.*
*ఉద్దేశ్యం :*
*పాపాలను శుద్ధి చేసి దైవిక ఆశీర్వాదాలను తెస్తుందని నమ్ముతున్న సరస్వతి నదిలో పవిత్ర స్నానాలు చేయడం
*ప్రాముఖ్యత :*
*ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే అరుదైన పండుగ.*
*ఆచారాలు :*
*భక్తులు పూజలు, ఆచారాలు మరియు విరాళాలలో పాల్గొంటారు.*
*సన్నాహాలు :*
*తెలంగాణ మొబైల్ యాప్ మరియు యాత్రికులకు మెరుగైన సౌకర్యాలతో సిద్ధమవుతోంది.*
*ఇతర ప్రదేశాలు :*
*బద్రీనాథ్ సమీపంలోని మానా గ్రామం కూడా సరస్వతి పుష్కరాలతో ముడిపడి ఉంది..*
*⑴ సరస్వతి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో..*
*కాశ్మీర్.. బాసరా (తెలంగాణ)..*
*⑵ బ్రహ్మదేవుడి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో…*
*పుష్కర్ (రాజస్థాన్)..* *ధర్మపురి (తెలంగాణ)..*
*⑶ త్రివేణి సంగమాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో..*
*అలహాబాద్ (ఉత్తర్ ప్రదేశ్)..* *కాలేశ్వరం (తెలంగాణ)*
*⑷ ఉత్తర వాహినిగా ప్రవహించే నదుల ప్రాంతం రెండే కలవు..*
*నర్మదా నది.. ఓంకారేశ్వర్ (మధ్యప్రదేశ్)*
*గోదావరి నది.. చెన్నూర్ (తెలంగాణ)*
*ధర్మపురి:-*
*యముడు శివునికై తపస్సు చేసింది ఇక్కడే..*
*(మార్కండేయుని విషయంలో చేసిన పాపం కారణంగా)*
*బ్రహ్మదేవుడు (సృష్టి)*
*నరసింహుడు, (స్థితి)*
*శివుడు, (లయం)*
*యముడు, (కాలం)*
*అరుదైన దైవ సంయోగ దేవాలయం ఇది*
*కాళేస్వసరం
*ఒకే పానవట్టం పై రెండు శివలింగాల అపురూప ఆలయం ఇది..*
*గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల అమృత సంగమ క్షేత్రం ఇది..*
*సరస్వతి నది చివరి సారి దర్శనం ఇచ్చింది ఇక్కడే..*
*వేములవాడ:-*
*అహల్య విషయంలో పాపం చేసిన దేవేంద్రుడు (దేవరాజు) శాప పరిహారానికి శివుడికై తపస్సు చేసింది ఇక్కడే. ఇక్కడి శివుడి నామదేయం రాజరాజేశ్వరుడు (రాజులకే రాజు ఆయన)*
*మెదక్:-*
*సప్తరుషులు తపస్సు చేసింది ఇక్కడే, మంజీర నది ఏడు పాయలుగా విడిపోయిన అద్భుత దృశ్యం ఇక్కడ ఉంది..
*యాదగిరి:-*
*అహోబిలం నుండి ఉగ్రరూపంతో వస్తున్న ఉగ్రనరసింహుడు శాంతించి లక్ష్మిదేవితో కలిసి వెలిసిన దేవాలయం..*
*కొండగట్టు:-*
*శ్రీరాముడు నడయాడిన ప్రాంతం గనక అమితానందంతో ఆంజనేయుడు సంజీవని పర్వతంలో ఓ భాగాన్ని వదిలిన ప్రాంతం.
*బాసర (వ్యాసపురి):-*
*వేదవ్యాస మహర్షి సరస్వతి మాతకై తపస్సు చేసి మహాభాగవతం రచించిన ప్రాంతం..*
*భద్రాచలం:-*
*శ్రీరాముడు మహావిష్ణువు రూపంలో ఉన్న ఏకైక ఆలయం.*
*చెన్నూర్:-*
*గోదావరి నది ఉత్తర వాహినిగా ప్రవహించే ఏకైక ప్రాంతం.*
*మంథని:-*
*మంత్రనగరి అసలు పేరు, త్రేతాయుగంలో వైదిక మంత్ర తంత్ర సాధన, పరిశోదనకై అగస్త్య మహాముని ఏర్పటు చేసిన తొలి ఆశ్రమం ఇక్కడే.
*బోదన్:-*
*బోధనపురి అసలు పేరు. మంతనిలో అభ్యసించి అర్హత సాదించిన గురువులు శిష్యులకు బోధించడానికి ఏర్పాటు చేసిన తొలి గురుకుల పాఠశాల ఇక్కడే.!!*


Be the first to comment