ఏసీబీకి చిక్కిన గ్రామ రెవెన్యూ కార్యదర్శి

ఏసీబీకి చిక్కిన గ్రామ రెవెన్యూ కార్యదర్శి

విజయనగరం :

విజయనగరం జిల్లా జామి మండలం అలమండ వీఆర్వో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. అలమండకు చెందిన మిడతాడ సూరీడమ్మ జామి తాసిల్దార్ కార్యాలయంలో తన భూమిని ఆన్ లైన్ లో మ్యుటేషన్ చేయుటకు దరఖాస్తు చేసుకుంది. దీంతో వీఆర్వో ఆర్నేపల్లి వేణు వారి నుండి రూ.15 వేలు లంచం డిమాండ్ చేయడంతో వారు ఏసీబీని ఆశ్రయించారు.మంగళవారం రాత్రి వీఆర్వో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*