జనసేన ఆధ్వర్యంలో ఉగ్రవాద దాడిని ఖండిస్తూ నిరసన తెలియజేశారు

జమ్ము కాశ్మీర్ లోని బైసారన్ దగ్గర పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి పరికిపంద చర్య అని చంద్రగిరి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ దేవర మనోహర్ అ దాడిని నిరసిస్తూ బుధవారం పార్టీ కార్యాలయం నుంచి టవర్ క్లాక్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి మృతుల కుటుంబాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవర మనోహర్ మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో భాగమైన బిజెపి ఉగ్ర మూకలపై ప్రతీకారం తీర్చుకుంటుందని స్పష్టం ఆయన చేశారు.ఈ కార్యక్రమం లో చంద్రగిరి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ దేవర మనోహర్ గారు,నాయకులు యువి రాయల్, కిషోర్ రాయల్, సునీల్ రాయల్, మధు రాయల్, నాగేంద్ర, రాకేష్, ఆశ, ప్రేమ్, మురళి మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*