గంజాయి విక్రయదారులు రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు

గంజాయి విక్రయదారులు రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. తాజాగా గంజాయిని చాక్లెట్ల రూపంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఈ ఘటన జరిగింది. ఎక్సైజ్‌ సీఐ శంకర్‌, ఎస్సై గోవర్ధన్‌ వివరాల మేరకు.. రాష్ట్ర సరిహద్దు కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద ఆదివారం తెల్లవారుజామున ఎక్సైజ్‌ పోలీసులు వా హనాల తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా విజయవాడ నుంచి హైదరాబాద్‌ వైపు వెళుతున్న ఓ ట్రావెల్స్‌ బస్సులో సోదాలు చేశారు. ఒడిశాకు చెందిన అనిల్‌, బకించంద్రతో పాటు మరో నలుగురు మహిళ లు బ్యాగులో గంజాయి చాకెట్లను తరలిస్తున్నట్లు గుర్తించి వాటిని స్వాధీ నం చేసుకున్నారు. ఆ చాక్లెట్ల విలువ సుమారు రూ.లక్ష ఉంటుందన్నారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*