18, డిసెంబర్, 2024 దృగ్గణిత పంచాంగం:
*సూర్యోదయాస్తమయాలు:*
ఉ 06.30 / సా 05.39
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి : కర్కాటకం
ఈనాటి పర్వం: *సంకష్టహర చతుర్థి*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయణం*
*హేమంత ఋతౌః / మార్గశిర మాసం / కృష్ణపక్షం*
*తిథి : తదియ* ఉ 10.06 వరకు ఉపరి చవితి
*వారం : బుధవారం*(సౌమ్యవాసరే)
*నక్షత్రం : పుష్యమి* రా 12.58 వరకు ఉపరి ఆశ్లేష
*యోగం : ఐంద్ర* రా 07.34 వరకు ఉపరి వైధృతి
*కరణం : భద్ర* ఉ 10.06 బవ రా 09.58 ఉపరి బాలువ
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 06.30 – 08.30 మ 01.30 – 05.00*
అమృత కాలం : సా 06.30 – 08.07
అభిజిత్ కాలం : ఈరోజు లేదు
*వర్జ్యం : ఉ 08.49 – 10.26*
*దుర్ముహూర్తం : ప 11.42 – 12.27*
*రాహు కాలం : మ 12.04 – 01.28*
గుళికకాళం : మ 10.41 – 12.04
యమగండం : ఉ 07.53 – 09.17
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : ఉ 06.30 – 08.44
సంగవ కాలం : 08.44 – 10.57
మధ్యాహ్న కాలం : 10.57 – 01.11
అపరాహ్న కాలం : మ 01.11 – 03.25
*ఆబ్ధికం తిధి : మార్గశిర బహుళ చవితి*
సాయంకాలం : సా 03.25 – 05.39
ప్రదోష కాలం : సా 05.39 – 08.13
రాత్రి కాలం : రా 08.13 – 11.39
నిశీధి కాలం : రా 11.39 – 12.30
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.47 – 05.39.
*18-12-2024-బుధవారం*
*రాశి ఫలితాలు:*
మేషం
నూతన పనులను ప్రారంభిస్తారు. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహన వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో కీలక వ్యవహారాలు చర్చించి మీ విలువను మరింత పెంచుకుంటారు.
వృషభం
కొన్ని వ్యవహారాలలో మిత్రులతో వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు.
మిధునం
సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన ఋణ ప్రయత్నాలు కలసి వస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.
కర్కాటకం
దూర ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు. స్థిరాస్తి వ్యవహారాలలో అవరోధాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి.
సింహం
కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలు మధ్యలో వాయిదా పడతాయి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
కన్య
దూరపు బంధువుల నుండి ఆసక్తికర విషయాలు సేకరిస్తారు. చేపట్టిన పనులు మందగిస్తాయి. నూతన రుణ యత్నాలు చిన్నపాటి ప్రయత్నం మీద పూర్తిఅవుతాయి. బందు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. కొన్ని వ్యవహారాలలో నిర్ణయాలు స్థిరంగా ఉండవు. వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు తప్పవు.
తుల
సమాజంలో పెద్దల నుండి విశేషమైన ఆదరణ పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. రియల్ ఎస్టేట్ రంగం వారికీ విశేషమైన లాభాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పురోగతి కలుగుతుంది.
వృశ్చికం
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ విషయమై ఉన్నతాధికారులతో ఉన్న సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు.
ధనస్సు
సంతాన సంబంధిత ఇబ్బందులు పరిష్కారమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలు స్వల్ప సమస్యలు తప్పవు.
మకరం
చేపట్టిన వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత నిరుత్సాహం కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు.
కుంభం
నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. మిత్రుల సలహాతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి. విలువైన గృహోప కరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.
మీనం
ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. ఋణ దాతలు నుండి ఒత్తిడి పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు తప్పవు.


Be the first to comment