ప్రభుత్వ ఉద్యోగి అవినీతి.. రాజ్య వ్యతిరేక నేరమే : సుప్రీం

ప్రభుత్వ ఉద్యోగి అవినీతి.. రాజ్య వ్యతిరేక నేరమే : సుప్రీం

దిల్లీ: ప్రభుత్వ ఉద్యోగి చేసే అవినీతిని రాజ్యానికి, సమాజానికి వ్యతిరేకంగా చేసిన నేరంగానే చూడాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. డబ్బులు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని మోసం చేసిన నిందితులకు సంబంధించిన క్రిమినల్‌ కేసును సంబంధిత కక్షిదారుల మధ్య రాజీ కుదిరిందన్న కారణంతో మద్రాసు హైకోర్టు కొట్టివేయడాన్ని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తప్పుపట్టింది. హైకోర్టు ఉత్తర్వులను పక్కనపెట్టి.. నిందితులపై క్రిమినల్‌ ఫిర్యాదును మళ్లీ తెరవాలని ఆదేశించింది. డబ్బులతో ప్రభుత్వ ఉద్యోగాలను కొనేవారు తిరిగి ఆ మొత్తం సంపాదించడానికి అవినీతికి పాల్పడతారని.. దీంతో పరోక్షంగా ప్రజలు బాధితులు అవుతారని.. అందువల్ల ఇలాంటి కేసుల్లో నిందితులను ఉపేక్షించకూడదని ధర్మాసనం పేర్కొంది.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*