_*పట్టణ పారిశుధ్యం పై స్పెషల్ ఫోకస్*_
_*పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేలా కార్యక్రమాలు*_
_*క్లీన్ నరసరావుపేట లక్ష్యంగా ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు అడుగులు*_
_నరసరావుపేట పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా మార్చడమే లక్ష్యంగా ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు అడుగులు వేస్తున్నారు.వార్డు వార్డునా సిబ్బందిని,కార్యకర్తల్ని వెంటబెట్టుకుని తిరుగుతూ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు.నరసరావుపేట పట్టణంలోని 01వ వార్డుల్లో శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించారు.ఫాగింగ్ చేపట్టారు.చీపురుపట్టి రోడ్లు ఊడ్చారు.కాలువలు శుభ్రం చేశారు.కాలువల సమీపంలో పెరిగిన పిచ్చి మొక్కల్ని కట్టర్లతో తొలగించారు.దోమల కారణంగానే వ్యాధుల వ్యాప్తి తీవ్రమవుతోందని,దోమలు పెరిగే ప్రాంతాలన్నింటినీ ఫాగింగ్,డీ వార్మింగ్ చేసుకోవాలని సూచించారు.ప్రజలు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.ఎక్కడా చెత్తా చెదారం రూడ్ల పై వేయకుండా చూసుకోవాలన్నారు.ప్రజలు ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలంటే అది కేవలం వ్యక్తిగత పరిశుభ్రత,పరిసరాల పరిశుభ్రతతో మాత్రమే సాధ్యం అన్నారు.ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ అధికారులు,పారిశుద్ధ్య కార్మికులు,టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు._


Be the first to comment