కూటమి ప్రభుత్వం లోకాపు ఖాకీలకు మొండిచెయ్యి…
+ పక్కా ప్లానింగ్ తో ఆ వర్గంకు ప్రాధాన్యత లేని పోస్టింగ్ లు
+ ఒకటి అర ఉన్నా.. సాగనంపేందుకు విశ్వ ప్రయత్నాలు
+ డిప్యూటీ సీఎం పవన్ దగ్గర ప్రస్తావించ టానికి సిద్ధమవుతున్న కాపు ప్రతినిధులు
ఎన్ డి పి సూర్య,
ఉమ్మడి గుంటూరు జిల్లా బ్యూరో: గత వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు పడిన కాపు సామాజిక వర్గం ఖాకీలు కూటమి ప్రభుత్వం వస్తే తమకు న్యాయం జరుగుతుందని ఆశపడ్డారు. ఏదో ఒకరికో ఇద్దరికో మొక్కుబడిగా ఆ సమయంలో పోస్ట్ లు దక్కించుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంచి రోజులు వస్తాయని ఎదురు చూశారు. వారి ఆశలు అడియాశలుగా మారాయి. ఇప్పుడు కూడా అవే ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది పోస్టింగులకు నోచుకోక విఆర్ లో కాలం సాగదీస్తున్నారు.
వైసీపీ సమయంలో కాపు సామాజిక వర్గంలో ఉన్నత స్థాయిలో ఉన్న పోలీసులకు పెద్దగా ప్రాధాన్యత ఉన్న పోస్టింగులు ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో కూడా వీళ్లను కీలక బాధ్యతలు ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ పరిస్థితి మారుతుందని… కాపు సామాజిక వర్గంలోనీ ఉన్నత స్థాయి పోలీసులు ఆశించారు. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తే వైసిపి హయాంలో మాదిరే ఇప్పుడు కూడా ఉందని తీవ్ర ఆవేదనలో ఉన్నట్లు తెలుస్తోంది. వృత్తిరీత్యా క్రమశిక్షణ కలిగిన శాఖ కావటంతో బహిరంగ చెప్పలేకపోయినా చాటుమాటుగా తమ ఆవేదనను… ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఓకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లకు మాత్రమే ప్రాధాన్యత కలిగిన పోస్టింగులు ఇస్తున్నట్లు కళ్ళకు కట్టినట్లు తెలుస్తోంది. ఏదో మొక్కుబడిగా ఒకరిద్దరికి
ట్రాఫిక్, స్పెషల్ బ్రాంచ్ వంటి పోస్టింగులు మాత్రమే ఇస్తూ పబ్బం గడుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో వైసిపి మాదిరే వివక్ష చూపిస్తుండటంతో ఆ సామాజిక వర్గం పోలీసులలో ఆవేదన మరింత పెరుగుతుంది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూస్తే ప్రధాన పోస్టింగులు సీఐలు మొదలు ఏసీపీలో డిఎస్పి ల వరకు మొత్తం ఒకే సామాజిక వర్గానికి పెద్ద పీట వేసి… కేవలం ప్రాధాన్యత లేని పోస్టుల్లో
కాపు సామాజిక వర్గం వారికి కేటాయిస్తున్నారట.. ఇప్పుడు ఇదే విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చగా అంశంగా మారింది. ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల కీలకమైన పోస్టింగులు పడిన వారిని తప్పించడానికి తెర వెనుక నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఒకరిద్దరిని కూడా పోస్టింగ్ లో ఉండ నీయకుండా వారిపై ఏదో ఒక రకంగా బురద చల్లి బదిలీ చేయించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నట్లు పోలీస్ శాఖలో బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక కీలకమైన పోస్టులో ఉన్న అధికారి నిజాయితీగా… పనిచేస్తుంటే.. వాళ్లకు కులముద్ర వేసి ఆ పోస్టుల నుంచి పంపించేందుకు సోషల్ మీడియాలో కథనాలు వీళ్ళే వండి వారిస్తూ తెర వెనుక మంతనాలు సాగించటం గమనార్హం. దీంతో కాపు సామాజిక వర్గం రెండింటీకి చెడ్డ రేవడిలా కాలo సాగిస్తున్నారు. ఉన్నత స్థాయి అధికారులకు గతంలో పోస్టింగులు లేక… ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కూడా పోస్టింగులు లేక తీవ్ర ఆవేదంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్న ఈ వ్యవహారంపై కాపు సంఘం ప్రతినిధుల దృష్టికి ఉన్నతాధికారులు తీసుకురావడంతో వాళ్లు కూడా వీరి అభిప్రాయంతో ఏకీభవించారు.
మొత్తం వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని కాపు పెద్దలు నిర్ణయించుకున్నారని వినికిడి. ప్రభుత్వం వచ్చిన తొలి రోజుల్లోనే నోరు విప్పకపోతే …
ఐదేళ్ల చాటు మాటుగా గడపాల్సి వస్తుంది అనేది నగ్నసత్యం. అలాగే పోలీసు తో పాటు ఇతర శాఖలలో కూడా ఇదే వ్యవహారం నడుస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని వదిలేస్తే… భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి కీలకంగా వ్యవహరిస్తున్న సామాజిక వర్గం నుండి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి వస్తుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. బలమైన వైసీపీ పార్టీని మట్టికరిపించిన కూటమి ప్రభుత్వం లో కీలక సామాజిక వర్గానికి మొండి చెయ్యి చూపించడంతో… కాపు పెద్దలు పవన్ దగ్గర ఈ పంచాయతీ పెట్టటానికి సిద్ధమయ్యారని తెలిసింది.
ఏది ఏమైనా ఈ పోస్టింగ్ ల వ్యవహారం పై కూటమి పెద్దలు సామాజిక న్యాయం చేస్తారో….!
మాకు ఒక్కరికి మాత్రమే న్యాయం అంటారో…!
వేచి చూడాల్సిందే.


Be the first to comment