NDA కూటమి నాయకులకు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు రావడంతో అభినంద సభ ఏర్పాటు చేశారు
మంగళగిరి నియోజకవర్గంలోని NDA కూటమి నాయకులకు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు రావడంతో మంగళగిరి సీనియర్ ఉపాధ్యాయులు మరియు శ్రేయోభిలాషులు SLM చైతన్య స్కూల్ ప్రాంగణంలో అభినంద సభ ఏర్పాటు చేశారు.
జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అధ్యక్షులు మరియు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఉంటూ రెండుసార్లు MLA సీటు ఇవ్వకపోయినా పార్టీ వెంటే ఉంటూ 2024 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారి గెలుపులో కీలక పాత్ర పోషించిన జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి ఏపీ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నామినేటెడ్ పదవి రావడంతో హర్షం వ్యక్తం చేస్తూ మంగళగిరి సీనియర్ ఉపాధ్యాయులు మరియు శ్రేయోభిలాషులు అభినందన సభ ఏర్పాటుచేసి వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసి పార్టీ కి మరియు మంగళగిరి నియోజకవర్గానికి మీ సేవలు మరువలేనవని అభినందించారు.


Be the first to comment