ఇక డిగ్రీ రెండున్నర ఏళ్ళే.. వచ్చే ఏడాది నుండి అమలు

ఇక డిగ్రీ రెండున్నర ఏళ్ళే.. వచ్చే ఏడాది నుండి అమలు

ఇక డిగ్రీ రెండున్నర ఏళ్ళే.. వచ్చే ఏడాది నుండి అమలు… విద్యార్థులు మూడేళ్ల డిగ్రీ కోర్సును రెండున్నర ఏళ్లలో, నాలుగేళ్ల కోర్సులు మూడేళ్లలోనే పూర్తిచేసే అవకాశాన్ని యూజీసీ కల్పించనున్నది 2025-26 నుండి దీన్ని అమలు చేస్తామని యుజిసి చైర్మన్ జగదీష్ కుమార్ వెల్లడించారు.

సీఎం ను చెత్త వెధవ అంటా.. తగ్గను.. అన్న కేటీఆర్… కెసిఆర్ లాంటి వ్యక్తిని తిడితే సీఎంను సైతం తిడతానని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ పితామహుడు లాంటి కెసిఆర్ పై సీఎం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే హౌలా, చెత్త వెధవ, బేకార్ గాడు, చిట్టి నాయుడు అంతాను. వెనక్కి తగ్గను అని జర్నలిస్టు ప్రశ్నకు స్పందించారు.
వారానికి 5 రోజుల పని… అభివృద్ధి చెందుతున్న ఇండియాలో మంచిది కాదన్నారు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి. హార్డ్ వర్క్ ప్రధాన లేదని మీరు అత్యంత తెలివైన వ్యక్తి అయినా కష్టపడాల్సిందేనని చెప్పారు. తాను ఓ ఇంటర్వ్యూలో రోజులో 14 గంటలు కష్టపడే వాడినని, పీఎం మోడీ వారానికి 100 గంటలు పని చేస్తారని దానిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

దేశంలోనే అత్యంత సురక్షితమైన 3 బ్యాంకులివే.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్, ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్‌లను దేశంలోని అత్యంత సురక్షితమైన బ్యాంకులుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఆర్బీఐ గుర్తించింది. ఈ మూడు బ్యాంకులను దేశీయ వ్యవస్థాత్మకంగా ముఖ్యమైన బ్యాంకులుగా (D-SIBs) గుర్తించింది.

టాటూ వేయించుకున్న 68 మంది మహిళలకు ఎయిడ్స్! సరదాకోసం ఒంటిపై రోడ్‌సైడ్ వ్యక్తుల దగ్గర ఈ టాటూలు వేయించుకోవడం వల్లే ఇన్‌ఫెక్షన్స్ సోకి.. ఎయిడ్స్ బారిన పడ్డట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన యూపీ ఘజియాబాద్‌లోని మహిళా ఆస్పత్రిలో ప్రసవానికి వచ్చిన మహిళలకు జరిపిన పరీక్షల్లో ఈ విషయం బయటపడ్డట్లు వైద్యులు వెల్లడించారు.

ఇకపై వరదలను ముందుగానే గుర్తించొచ్చు..గూగుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా వరదలను ముందుగా ఊహించే కొత్త మోడల్‌ను పరిచయం చేసింది. ఈ మోడల్, వరదల కారణంగా జరిగే అనేక విపత్తులకు ముందస్తుగా హెచ్చరికలు ఇవ్వగలదు. ఇప్పటికే గూగుల్ ఈ సేవను 100 దేశాలలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మోడల్ ద్వారా ప్రజలు, ప్రభుత్వాలు వరదలు వచ్చే అవకాశాన్ని ముందుగా తెలుసుకోగలుగుతారు.

గొడవ పడిన భార్యాభర్తలు…భార్యను తిట్టి కొడుతున్న ధీరజ్‌ ప్రవర్తనపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. అతడ్ని అడ్డుకునేందుకు పొరుగింటి వ్యక్తి జోక్యం చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన భర్త అతడి తలపై ఇనుప రాడ్‌తో కొట్టాడు. మెట్లపై నుంచి కిందపడిన ఆ వ్యక్తి తలకు తీవ్ర గాయం కావడంతో మరణించాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. నవంబర్‌ 13న ఇంటి విషయంపై తన భార్యతో ధీరజ్ గొడవపడ్డాడు. ఆమెను దుర్భాషలాడటంతోపాటు కొట్టాడు.

ఏడుగురు విద్యార్థులు మందు పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత బీఎండబ్ల్యూలో అర్ధరాత్రి వేళ అతి వేగంగా ప్రయాణించారు. ఆ కారు ప్రమాదంలో ఆరుగురు దారుణంగా మరణించారు. వారి తెగిన తలలు, శరీర భాగాలు రోడ్డుపై పడ్డాయి. మృతుల్లో ముగ్గురు యువతులున్నారు. ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో ఈ సంఘటన జరిగింది.

పుట్టిన రోజు నాడే ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేషం గ్రామానికి చెందిన చింత స్నిగ్ధ అనే విద్యార్థిని ఫిలిప్పీన్స్ దేశంలో ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన స్నిగ్ధ పుట్టిన రోజే ఈ రోజు తెల్లవారు జామున 3 గంటల సమయంలో చనిపోవడం కలకలం రేపింది. కాగా, విద్యార్థినీ తండ్రి చింత అమృత్ రావు మెదక్ పట్టణం విద్యుత్ శాఖలో డీఈగా విధులు నిర్వహిస్తున్నారు. స్నిగ్ధ మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో 12 శాతం మంది మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారని, షుగర్‌ వ్యాధి ప్రమాదకరంగా పెరుగుతోందని, ప్రజలు తక్షణమే అప్రమత్తమై పరీక్షలతో వ్యాధిని గుర్తించి ఆరోగ్యవంతమైన జీవనశైలిపై దృష్టి సారించాలని ఐఎంఏ తెలంగాణ

రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్‌ దువ్వూరు ద్వారకనాథ్‌రెడ్డి, శాఖ కార్యదర్శి డాక్టర్‌ అశోక్‌ అన్నారు.
బంగ్లాదేశ్‌ ఇస్లామిక్‌ దేశం దిశగా అడుగులు వేస్తున్నది. ఆ దేశ రాజ్యాంగం నుంచి ‘సెక్యులర్‌’ పదం తొలగింపునకు ప్రయత్నం జరుగుతున్నది. ఈ మేరకు ఆ దేశ అటార్నీ జనరల్‌ మహమ్మద్‌ అసదుజ్జామన్‌ సుప్రీంకోర్టులో ఇటీవల వాదనలు వినిపించారు. దేశంలో 90 శాతం మంది ముస్లింలు ఉన్న నేపథ్యంలో సెక్యులర్‌ అనే పదానికి అర్థం లేదని అన్నారు.
వజ్రానికి రి సేల్ వేల్యూ ఉండదా..? గోల్డ్ కంటే డైమండ్స్ విలువైనవే…కానీ డైమండ్స్ కంటే బంగారమే గొప్పట. వజ్రాలకు విలువ ఉండదు అంటున్నాయి మార్కెట్ వర్గాలు.

యజమాని సగం ముఖాన్ని పీకేసిన పెంపుడు కుక్క. బరేలికి చెందిన ఆదిత్య శంకర్ అనే వ్యక్తి పిట్ బుల్ ను పెంచుకుంటున్నారు. తాజాగా ఆ కుక్క ఆతనిపై దాడికి పాల్పడింది. పెదాలు, సగానికి పైగా ముఖాన్ని పీకేసింది. కుటుంబీకులు వెంటనే ఆసుపత్రికి తరలించిన వైద్యులు సర్జరీ చేశారు.

గాడిద పాలతో ఘరానా మోసం..! గాడిద పాల పేరుతో డాంకీ ప్యాలెస్ సంస్థ తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటకలోని రైతులను రూ.100 కోట్ల వరకు మోసం చేసీంది. ఒక్కో గాడిదను రూ.లక్షన్నరకు అమ్మిన సంస్థ లీటర్ పాలను రూ .1600 లకు కొంటామని నమ్మించింది. తొలి 3 నెలలు నమ్మకంగా సేకరణ డబ్బులు చెల్లించి, గత 18 నెలలుగా పెండింగ్ లో ఉంచింది. చెక్కులు ఇచ్చినా అవి బౌన్స్ అయ్యాయి.
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు 25 శాతం రాయితీ..! ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజనులకు 25 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా ఏ ఆర్టిసి బస్సులోనైనా ఈ రాయితీతో ప్రయాణించే వీలుంటుంది. సీనియర్ సిటిజనులకు 60 ఏళ్ల వయసు పైబడి ఉండాలి. ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడి, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, పాస్ పోర్ట్, రేషన్ కార్డుల్లో ఏదైనా చూపించాల్సి ఉంటుంది. అది ఫిజికల్ లేదా డిజిటల్ రూపంలోనైనా చూపించవచ్చని ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది.

ప్రభుత్వ స్కూల్లో ఆవరణలలో వివాహాలు, రాజకీయ, మతపరమైన సమావేశాలను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. పాఠశాలల పని వేలలకు ముందు, తర్వాత, సెలవుల్లో ఇలాంటి కార్యక్రమాలకు ఆర్జీడీలు, డిఈవోలు, హెచ్ఎంలు అనుమతి ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఇకపై ఎట్టి పరిస్థితిలోనూ అలాంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వద్దని తెలిపింది.

ఇస్రో ఖర్చు చేసే ప్రతి రూపాయికి ఎంత ఆదాయం వస్తుందో తెలుసా..? తాజాగా కర్ణాటకలోని ఓ విద్యాసంస్థ విద్యార్థులతో ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమ్‌నాథ్‌ మాట్లాడుతూ. భారతదేశం అంతరిక్ష పరిశోధనలకు వెచ్చిస్తున్న దానికంటే 2.54 రెట్లు తిరిగి పొందుతోందని అన్నారు. అంటే 1 రూపాయి పెట్టుబడి పెడితే 2.5 రూపాయలు తిరిగి వస్తాయి.అంతరిక్ష రంగం ద్వారా వచ్చే ఆదాయంలో భారతదేశం ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో ఉందన్నారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*