ఖమ్మం జిల్లా ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన.

కాపున్యూస్ ప్రతినిధి

వికారాబాద్
జిల్లా కలెక్టర్ పై దాడి హేయమైన చర్య.

ఖమ్మం జిల్లా ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన.

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్,రెవెన్యూ అధికారులు, ఫోర్త్ క్లాస్, ఎన్జీఓ అధికారులపై దాడిచేయడం హేయమైన చర్యని టి జి ఓస్ జిల్లా అధ్యక్షులు కాస్తాల సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర టిజీఇ జేఏసీ పిలుపుమేరకు గురువారం ఖమ్మం ఐడీఓసి కార్యాలయం, జిల్లా కలెక్టరేట్ ఎదుట లంచ్ అవర్ లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీ ధరించుకొని ధర్నా నిర్వహించారు. కాస్తాలతో పాటు కళావతి బాయ్, మోదుడు వేలాద్రి, గుంటుపల్లి శ్రీనివాస్, జస్. ఎస్.జయపాల్, కొణిదెన శ్రీనివాస్, రాజశేఖర్ గౌడ్,
డిఆర్డీఓ

సన్యాసయ్య, జె ఏ సి నాయకులు యలమద్ది వెంకటేశ్వరరావు, పారుపల్లి నాగేశ్వరావు, పి సునీల్ రెడ్డి, మాట్లాడుతూ సమస్యను
సామరస్యంగా మాట్లాడి పరిష్కారించుకోవాల్సింది పోయి, వికారాబాద్ జిల్లా లోఫార్మ కంపెనీ కింద భూములు కోల్పోతున్న నిర్వాసితులు కలెక్టర్ ను సమస్యల పరిష్కారం కోసం మాట్లాడేందుకు పిలిచి, దాడి చేయడం దుర్మార్గపు చర్య అన్నారు. ఈ దాడి వెనుక కుట్ర దాగి ఉందనే అనుమానం వ్యకం చేసారు. దానివేనుక ఎంతటి వారున్న క్షమించకుండా చట్ట బద్ధమైన చర్యలు తీసుకుని దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఐ డి ఓ సి లో పనిచేస్తున్న అన్ని శాఖల ఉద్యోగులు, సంఘాల నాయకులు ఉద్యోగులు కలిసిఅనంతరం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ కు వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమం లో డాక్టర్ సైదులు, వి. వెంకన్న, ఎస్. ప్రకాష్, టి. శ్రీకాంత్, రుక్మారావు, ఎం. వీరన్న, పి. రాధాకృష్ణ, అస్లాం, శంకర్, అంజమ్మ, వివిధ ప్రభుత్వ, రిటైర్డ్, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, శాఖలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*