ఉత్తరాంధ్ర యాసలో అదరగొట్టిన చిరంజీవి

అగ్ర కథానాయకుడు చిరంజీవి తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ సరదాగా ఉంటారు. తాజాగా ఓ అభిమానిని ఆయన ఆటపట్టించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా ఈశ్వర్‌ కార్తీక్‌ తెరకెక్కించిన చిత్రం ‘జీబ్రా’. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు చిరంజీవి (Chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిత్ర బృందానికి ఆల్‌ది బెస్ట్‌ చెప్పారు.

చిరు వేదికపై మాట్లాడుతుండగా ఓ అభిమాని ‘బాసూ నిన్ను చూసేందుకు వైజాగ్‌ నుంచి వచ్చాను’ అని గట్టిగా అరిచి చెప్పారు. దీంతో చిరు ఒక్కసారిగా స్పీచ్‌ ఆపేసి ‘అయితే ఏటంటావ్‌ ఇప్పుడు.. నువ్వు వైజాగ్ నుంచి వచ్చినందుకు సంతోషమే.. మరి ఈ బొమ్మను నువ్వు వైజాగ్‌లో ఆడించాలి.. భలేవాడివే..’ అంటూ ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడారు (Chiranjeevi Speaks vizag slang). దీంతో వేదిక మొత్తం చప్పట్లతో మారుమోగింది. అక్కడున్న ప్రేక్షకులు నవ్వుతూ ఎంజాయ్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘చిరు టైమింగ్‌ సూపర్‌’, ‘బాసూ.. నువ్వు ఏ యాసలోనైనా మాట్లాడగలవు’ ‘కామెడీ టైమింగ్‌లోనూ నువ్వు మెగాస్టార్‌వి’ అంటూ అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. ‘జీబ్రా’ ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే (Zebra release Date).

ఇక చిరు సినిమాల విషయానికొస్తే.. వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ (Vishwambhara)లో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌. ఆషికా రంగనాథ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటివరకూ చిరంజీవి నటించిన సినిమాలతో పోలిస్తే, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా దీని చిత్రీకరణ జరుగుతోంది. ఓ సాంగ్‌ షూటింగ్‌ కోసం మూవీ టీమ్‌ జపాన్‌ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*